ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. విడుదలకు కొన్ని గంటల ముందు టైటిల్ మార్చాల్సి రావడంతో తాము చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నామని, కానీ అభిమానులు చాలా మద్దతుగా నిలిచారని హరీష్ తెలిపారు. 

సోషల్ మీడియాలో చాలా మీమ్స్ కనిపించాయి. అన్నా మారింది టైటిలే కంటెంట్ కాదు అని ఫ్యాన్స్ మెసేజ్ లు పెట్టడంతో చాలా సంతోషంగా అనిపించింది. తొలి షో నుంచి చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. వరుణ్ తేజ్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో అందించాడని అంతా ప్రశంసిస్తున్నారు. 

చిరంజీవి గారు శుభాకంక్షలు చెబుతూ మెసేజ్ చేశారు. బన్నీ ఫోన్ చేసి అభినందించినట్లు హరీష్ శంకర్ తెలిపాడు. ఈ చిత్రంలో తాను చిత్ర పరిశ్రమ గురించి రాసిన డైలాగులు చాలా బావున్నాయని అందరి నుంచి స్పందన వస్తున్నట్లు హరీష్ తెలిపాడు.