మరో వారాంతానికి బిగ్ బాస్ షో చేరుకుంది. అంటే హౌస్ నుండి ఆదివారం ఒకరు వెళ్లిపోనున్నారు. గత ఆదివారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక ఈ వారానికి గానూ ఆరుగురు ఎలిమినేషన్స్ లో ఉన్నారు. మోనాల్, అభిజిత్, హారిక, లాస్య, సోహైల్ మరియు ఆరియానా ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న వీరి నుండి ఆదివారం ఒకరు ఎలిమినేట్ కావడం జరుగుతుంది. 

దీనితో ఈ వారం ఎలిమినేషన్ పై ఆసక్తి కొనసాగుతుంది. హీరో అభిజిత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడంతో పాటు అతను సపరేట్ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు. అందుకే చాలా సార్లు నామినేటైనా కూడా అభిజీత్ ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అవుతున్నాడు. అలాగే సింగరేణి ముద్దు బిడ్డ అంటూ ఒక సపరేట్ ట్రేడ్ మార్క్ సంపాదించుకున్న సోహైల్ కూడా మంచి ప్రేక్షకాభిమానం సంపాదించారు. అందుకే ఆయనకు బాగానే ఓట్లు వస్తున్నాయి. 

నిజానికి మోనాల్ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాకపోయినప్పటికీ ఆమె లవ్ ఎఫైర్స్, డ్రామా వర్కవుట్ అవుతుంది. అలాగే అఖిల్ ఫ్యాన్స్ ఆమెను సప్పోర్ట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. కాగా ఈ వారం లాస్య, హారిక మరియు ఆరియానా డేంజర్ జోన్ లో ఉన్నారట. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ జెన్యూన్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న ఆరియానా కూడా సేవ్ అవుతారన్న మాట వినిపిస్తుంది. 

కాగా ఇక ఈవారం హారిక మరియు లాస్యలలో ఒకరు అవుట్ కానున్నారని సమాచారం. ఎలిమినేషన్ లో ఉన్న ఆరుగురు సభ్యులలో వీరికి తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. లాస్యది ఫేక్ స్మైల్, సేఫ్ గేమ్ అని ప్రేక్షకులు భావిస్తున్నారట. ఇక హారిక ఒక వర్గానికి మాత్రమే సప్పోర్ట్ చేస్తూ నెగెటివిటీ మూటగట్టుకున్నారు. వీరిద్దరిలో కూడా దాదాపు హారిక హౌస్ నుండి వెళ్ళిపోనుందని సమాచారం. మరి ఈ అంచనాలు ఎంత వరకు కరెక్టో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే...