ఒక సినిమా మొదలవుతుందంటే దాని వెనుక చాలా వర్క్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. దర్శకనిర్మాతల మధ్య డిఫరెన్సెస్ రావడం, హీరోకి దర్శకుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ఇష్యూలు బయటపడుతుంటాయి.. మరికొన్ని సార్లు లోలోపలే ఉండిపోతాయి.

అయితే రీసెంట్ గా దర్శకుడు హరీష్ శంకర్ కి, దిల్ రాజుకి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన 'దాగుడు మూతలు' సినిమా సెట్స్ పైకి వెళ్లలేదని అన్నారు. 'డీజే' సినిమా తరువాత హరీష్ శంకర్ తో కలిసి మరో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు దిల్ రాజు. దానికి 'దాగుడు మూతలు' అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు.

శర్వా, నితిన్ హీరోలుగా సినిమా ఉంటుందని చెప్పారు. కానీ సినిమా సడెన్ గా ఆగిపోయింది. దాంతో హరీష్ శంకర్.. దిల్ రాజు కాంపౌండ్ నుండి బయటకి వచ్చి 14 రీల్స్ బ్యానర్ పై 'వాల్మీకి' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా విషయంలో కూడా నిర్మాతలకు హరీష్ కి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఈ విషయాలపై తాజాగా హరీష్ శంకర్ స్పందించాడు.

తనకు 'వాల్మీకి' చిత్రనిర్మాతలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని వాళ్లు ఎక్కువ ఖర్చు పెట్టిన ప్రతీసారి తనే కంట్రోల్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇక దిల్ రాజుతో కూడా తనకు ఎలాంటి గొడవలు లేవని కాకపోతే కాస్టింగ్ విషయంలో ఆయనతో ఇబ్బంది అంటూ చెప్పాడు. ప్రస్తుతం వారిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని 'వాల్మీకి' సినిమా వైజాగ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దిల్ రాజే అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే 'దాగుడు మూతలు' సినిమా కూడా తీస్తానని చెప్పారు.