నేడు(శుక్రవారం) డార్లింగ్ ప్రభాస్ కావడంతో దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆనందంతో దసరా పండుగని రెండు రోజుల ముందే చేసుకుంటున్నారు.
ప్రభాస్..ఇమేజ్, పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి తెలుగు ఆడియెన్స్ తెలుసు. ఆయన బర్త్ డే అంటే దేశ వ్యాప్తంగా ఓ పండగలా నెలకొంది. నేడు(శుక్రవారం) డార్లింగ్ ప్రభాస్ కావడంతో దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆనందంతో దసరా పండుగని రెండు రోజుల ముందే చేసుకుంటున్నారు. అంతేకాదు గతంలో మహేష్, పవన్ కళ్యాణ్ `హ్యాపీబర్త్డ డే` యాష్‌ట్యాగ్‌లను ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల వంతు వచ్చింది. దీంతో ట్విట్టర్‌ని షేక్ చేసే పనిలో పడ్డారు.
ప్రస్తుతం `హ్యాపీబర్త్ డే ప్రభాస్` యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది. దేశ వ్యాప్తంగా డార్లింగ్ అభిమానులు ఈ యాష్ ట్యాగ్‌ని రీట్వీట్లతో ఊపేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు యాష్‌ట్యాగ్‌లను దాటడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. మరి ఆ లక్ష్యాన్ని దాటుతారా? అన్నది చూడాలి. కానీ ఇప్పుడు ప్రభాస్ బర్త్ డే ట్యాగ్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
