ఆదిపురుష్ రిలీజ్ కావడంతో ఇండియా మొత్తం ప్రభాస్ అభిమానులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఆరాధ్య దైవం, ఆదర్శ పురుషుడిగా కొలిచే శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ ని చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్స్ కి ఎగబడుతున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చారిత్రాత్మక చిత్రం ఆదిపురుష్. భారతీయులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆరాధించే పుణ్యపురుషుడు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం ఇది. రామాయణం పురాణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్నో వివాదాల మధ్య నలుగుతూ.. అదే విధంగా భారీ అంచనాలతో ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరాముడిగా ప్రభాస్ నటించగా .. జానకి పాత్రలో కృతి సనన్.. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. 

ఆదిపురుష్ రిలీజ్ కావడంతో ఇండియా మొత్తం ప్రభాస్ అభిమానులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఆరాధ్య దైవం, ఆదర్శ పురుషుడిగా కొలిచే శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ ని చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్స్ కి ఎగబడుతున్నారు. జైశ్రీరామ్ నినాదాలతో దేశవ్యాప్తంగా థియేటర్లు హోరెత్తుతున్నాయి. అదే సమయంలో ఆంజనేయ స్వామిపై కూడా భక్తి పారవశ్యం వెల్లివిరుస్తోంది. ఈ చిత్రంలో హనుమంతుడు పాత్రలో దేవదత్త నాగే నటించారు. 

హనుమంతుడి కోసం ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ చేసిన కృషి ఫలించినట్లు ఉంది. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడని భక్తుల విశ్వాసం. ఆ నమ్మకంతోనే ఆదిపురుష్ ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీట్ కేటాయించారు. ఈ విషయంలో ఓం రౌత్ చొరవ తీసుకున్నారు. 

చూస్తుంటే ఓం రౌత్ నమ్మకం నిజమైనట్లు నిజమైనట్లు అనిపిస్తోంది. ఆదిపురుష్ చిత్రం ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ లో వానరం (కోతి) ప్రవేశించింది. భక్తులు కోతిని హనుమంతుడి రూపం గా భావిస్తారు. చిన్న ప్రదేశం ఉన్న వెంటిలేటర్ నుంచి ఆ కోతి ఆదిపురుష్ థియేటర్ లోకి ప్రవేశించింది. సరిగ్గా అదే సమయంలో బిగ్ స్క్రీన్ పై శ్రీరాముడిగా ప్రభాస్ డైలాగ్ చెబుతున్నాడు. 

Scroll to load tweet…

కోతిని చూసిన ప్రేక్షకుల్లో ఒక్కసారిగా ఓరెత్తిపోయారు. నిజంగానే హనుమంతుడు వచ్చినట్లుగా భావించి జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు చేశారు. రాముడిపై భక్తి భావం ఎక్కడ వెల్లివిరుస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడనే నమ్మకం ఈ సంఘటనతో నిజం అయింది ప్రేక్షకులు చెబుతున్నారు. 

Scroll to load tweet…

కొందరు ఆడియన్స్ ఈ సంఘటనపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఆ థియేటర్ లో హనుమంతుడికి సీట్ కేటాయించినట్లు లేరు. అందుకే హనుమాన్ వెంటిలేటర్ ఎక్కాడు అని కామెంట్ చేయగా.. మరికొందరు వేర్ ఈజ్ మై సీట్ అని హనుమాన్ అడుగుతున్నట్లు పెట్టారు. హనుమంతుడు ఆదిపురుష్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి వచ్చేశారు అని మరికొందరు అంటున్నారు. 

Scroll to load tweet…

ప్రీ రిలీజ్ వేడుకలో చినజీయర్ స్వామి శ్రీరాముడి గురించి ఒక విషయం చెప్పిన సంగతి తెలిసిందే. శ్రీరాముడు ఉన్న చోట ఆయన పట్ల జంతువులు, పశు పక్షాదులు కూడా ఆకర్షణకు గురయ్యేవి. రాముడిని ప్రేమించని వారు అంటూ లేరు అని అన్నారు. బహుశా అది కూడా నిజమే అని ఈ సంఘటనతో అనిపిస్తోంది. థియేటర్ రామనామ స్మరణతో హోరెత్తుతుంటే వానరం రూపంతో హనుమంతుడు అక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఇదిలా ఉండగా ప్రతి థియేటర్ లో హనుమంతుడు కోసం ఒక సీట్ కేటాయించి ఆ సీట్ కి ఆడియన్స్ పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి.