Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య రామ మందిరానికి హనుమాన్ నిర్మాతల భారీ విరాళం... ఎన్ని కోట్లు ఇచ్చారంటే?

హనుమాన్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ నమోదు చేశారు తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ. బాక్సాఫీస్ షేక్ చేస్తున్న హనుమాన్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలో నిర్మాతలు అయోధ్య రామ మందిరానికి కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. 
 

hanuman team huge donation to ayodhya rama mandir ksr
Author
First Published Jan 21, 2024, 12:55 PM IST

బడా హీరోలను వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు తేజ సజ్జా. ఆయన హీరోగా నటించిన హనుమాన్ బ్లాక్ బస్టర్ కొట్టింది. పాన్ ఇండియా రేంజ్ విజయం సాధించింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ జనవరి 12న విడుదల చేశారు. సోషియో ఫాంటసీ సబ్జెక్టుకి డివోషనల్ టచ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేశాడు. తక్కువ బడ్జెట్ లో గొప్ప విజువల్స్ ఆవిష్కరించాడు. 

హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. నార్త్ అమెరికాలో బడా హీరోలకు కూడా సాధ్యం కానీ వసూళ్లు నమోదు చేసింది. హిందీలో సైతం హనుమాన్ చిత్రానికి ఊహించని ఆదరణ లభించింది. హనుమాన్ మూవీ రూ. 50 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో అయోధ్య రామ మందిరానికి భారీగా విరాళం ప్రకటించారు నిర్మాతలు. 

ఇప్పటివరకు 53,28,211 హనుమాన్ సినిమా టికెట్స్ అమ్ముడు పోయాయట. ఈ క్రమంలో రూ. 2,66, 41,055 అయోధ్య రామ మందిర్ కి డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. రెండున్నర కోట్లకు పైగా రూపాయలు డొనేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. రేపు అయోధ్యలో రామ మందిరం ఘనంగా ప్రారంభం కానుంది. టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్, ప్రభాస్, చిరంజీవి పాల్గొననున్నారు. 

హనుమాన్ మూవీలో తేజ సజ్జాకు జంటగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ హీరో అక్క పాత్రలో అలరించింది. వినయ్ రాయ్ విలన్ రోల్ చేశాడు. హనుమాన్ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుండి తప్పించాలని చూశారు. పట్టుబట్టి నిర్మాతలు చిత్రాన్ని విడుదల చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios