Asianet News TeluguAsianet News Telugu

#Hanuman నైజాంలో షాక్, నాన్ కోపరేషన్ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్!

 సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ కోసం అదనపు థియేటర్లు జోడించారు. 

Hanuman Nizam Outstanding despite Non cooperation Break even done jsp
Author
First Published Jan 15, 2024, 8:46 AM IST

తేజ్ సజ్జా నటించిన హనుమాన్ సినిమా వసూళ్లు రెండో రోజు అంటే శనివారం 55 శాతానికి పైగా పెరిగి అందరికీ షాక్ ఇచ్చాయి. మూడో రోజు భీబత్సమే అయ్యింది. చాలా చోట్ల గుంటూరు కారం చాలా స్క్రీన్స్ కూడా.. హనుమాన్‌కి షిప్ట్ కావడం విశేషం. ఈ చిత్రానికి టిక్కెట్ల డిమాండ్ భారీగా ఉంది . దీని కారణంగా అదనపు షోలు, థియేటర్లు నిరంతరం పెరగడం విశేషం. ప్రతి రోజు గడిచేకొద్దీ పెద్ద సంఖ్యలో హనుమాన్ చూడాలని అనుకునేవారి సంఖ్య పెరగుతున్నారు. పండగ రోజుల్లో ఈ సినిమా అన్ని ఏరియాల్లో సంచలనం సృష్టిస్తోంది. హనుమాన్ కోసం అడ్వాన్స్ బుకింగ్‌లు రాబోయే రోజుల్లో బలంగా ఉన్నాయి.

ఇక నైజాంలో నాన్ కోపరేషన్ ఉన్నా కూడా కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. మూడో రోజు గ్రాస్ ₹3.35 కోట్లు, షేర్ ₹1.85 కోట్లు, వీకెండ్ టోటల్ ₹6.55cr (gst కలపకుండా). బ్రేక్ ఈవెన్ అయ్యిపోయిందని తెలుస్తోంది. దాంతో సంక్రాంతి విన్నర్ గా హనుమాన్ ఫిక్సైపోయింది. వార్ వన్ సైడ్ అయ్యిపోయింది.  బాక్స్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాగా రిలీజ్ అయిన హానుమాన్(HanuMan Movie) అదిరిపోయే  కలెక్షన్స్ తో  దూసుకుపోతంది. లిమిటెడ్ రిలీజ్ తోనే ఊరమాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని రచ్చ రచ్చ చేయటం ట్రేడ్ కు షాక్ ఇస్తోంది. ఎక్సపెక్టేషన్స్  అన్నీ మించిపోయే రేంజ్ లో ఊచకోత కోసిన ఈ సినిమా సాలిడ్ నంబర్స్ ను నమోదు చేయటంతో సినీ లవర్స్ లో  ఇదే హాట్ టాపిక్ గా మారింది. 
 
ఇప్పటి ట్రెండ్ ని బట్టి ,అడ్వాన్స్ బుక్కింగ్ లని బట్టి రాబోయే మూడు రోజులు టెర్రిఫిక్ గా ఉంటుంది. మొదటి రోజు కన్నా రెండో రోజు బాగా పెరిగింది. మూడో రోజు ఇంకా భీబత్సం జరగనుంది. ఇదే రన్ కొనసాగితే ఫెస్టివల్ డేస్ దాటాకా కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా తెలుగులో ఫుల్ రన్ కి 100 కోట్ల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక అనేక చిత్రాల్లో బాల నటుడిగా ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జ (Teja Sajja) తాజా చిత్రం ‘హను-మాన్‌’ (Hanu Man). ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయ్యింది. మరోవైపు, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (Mahesh Babu)- డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఈ రోజున అయ్యింది. ఈ నేపధ్యంలో చిత్రంకు థియేటర్స్ తక్కువ కేటాయించారని వివాదాలు సైతం వచ్చాయి. అయితే నార్త్ మార్కెట్ ని భారీగా టార్గెట్ చేస్తున్న ‘హను-మాన్‌’ పూర్తి రికవరీ మోడ్ లో ఉందని ట్రేడ్ అంటోంది.  అలాగే ఈ చిత్రం  27 కోట్లకు అమ్మారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాల్లో ఇదే హైయిస్ట్ రేటు పలికిన చిత్రం.  

 మరో ప్రక్క   డిజిట‌ల్, శాటిలైట్ రైట్స్ ద్వారా మెజారిటీ రిక‌వ‌రీ అయింద‌ని స‌మాచారం.  ఈ చిత్రం నాన్ థియేటర్ బిజినెస్ రైట్స్ ని Zee గ్రూప్ వారు 30 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో బడ్జెట్ లో సగం అక్కడే రికవరీ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 20 కోట్లుకు బిజినెస్ చేసారని తెలుస్తోంది. అలా మొత్తం 50 కోట్ల వరకూ బడ్జెట్ నాన్ థియేటర్ రైట్స్, తెలుగు రాష్ట్రాల బిజినెస్ తో రికవరీ అయ్యిందని సమాచారం. ఇక సినిమా ఓవర్ సీస్, తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశంలో మిగతా ప్రాంతాలు, ముఖ్యంగా నార్త్ బెల్ట్  మంచి బిజినెస్ చేసాయి. డిస్ట్రిబ్యూటర్ రికవరీ రెట్టింపు పైగైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 
    
 తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంటోంది.  పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసాన్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios