హనుమాన్ టీమ్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నైజాం లో టికెట్స్ ధరలు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. హనుమాన్ నిర్మాతలు టికెట్స్ రేట్లు ఏ మేరకు తగ్గించారో చూద్దాం..
2024 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది హనుమాన్. చిన్న చిత్రంగా విడుదలై అతిపెద్ద విజయం సాధించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రేక్షకులకు హనుమాన్ తో అద్భుత అనుభూతి పంచాడు. తేజ సజ్జా హీరోగా సోషియో ఫాంటసీ అంశాలతో సూపర్ హీరో చిత్రం చేశాడు. ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన విఎఫ్ఎక్స్ ఇచ్చాడని చిత్ర ప్రముఖులు, ఆడియన్స్ కొనియాడారు. హనుమాన్ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
హిందీలో సైతం ఆదరణ దక్కించుకుంది. విడుదలై నెల రోజులు అవుతున్నా హనుమాన్ చెప్పుకోదగ్గ ఆదరణ పొందుతుంది. హనుమాన్ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేర్చేందుకు నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. టికెట్స్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ ధర రూ. 175గా ఉంది. దాన్ని రూ. 100 కి తగ్గించారు. మల్టీఫ్లెక్స్ లో రూ.295 గా ఉంది. దాన్ని రూ. 150కి తగ్గించారు.
కొత్త ఆడియన్స్ తో పాటు రిపీట్ ఆడియన్స్ కోసం నిర్మాతలు ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక హనుమాన్ చిత్రానికి సీక్వెల్ జై హనుమాన్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హనుమాన్ గా ఓ స్టార్ హీరో నటిస్తాడని ప్రశాంత్ వర్మ తెలియజేశాడు. 2025లో జై హనుమాన్ విడుదల కానుంది. రానా, కెజిఎఫ్ ఫేమ్ యష్ పేర్లు వినిపిస్తున్నాయి. అధికారిక సమాచారం లేదు.
