Asianet News TeluguAsianet News Telugu

#Hanuman..మహేష్ పై పోటీకి అసలు కారణం,పెద్ద స్కెచ్చే

అసలు హనుమాన్ థీమా ఏమిటి..గుంటూరు కారం కే మాగ్జిమం థియేటర్స్ కేటాయింపు జరిగిన నేపధ్యంలో హనుమాన్ ఏ   ధైర్యంతో  ఉన్నారు అంటే...నార్త్ ఇండియా మార్కెట్ ని మెయిన్ అనుకుని దిగటమే కారణం అని తెలుస్తోంది.

Hanuman movie is releasing in 1500 screens across North India jsp
Author
First Published Jan 4, 2024, 9:14 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాతో పాటు.. అదే రోజున   ప్రశాంత్ వర్మ, యువ హీరో తేజా సజ్జ నటించిన ‘హనుమాన్’ మూవీ ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. సంక్రాంతి కానుకగా.. జనవరి 12 ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. దాంతో అందరి దృష్టీ హనుమాన్ పై పడింది. అసలు హనుమాన్ థీమా ఏమిటి..గుంటూరు కారం కే మాగ్జిమం థియేటర్స్ కేటాయింపు జరిగిన నేపధ్యంలో హనుమాన్ ఏ ధీమాతో ఉన్నారు అంటే...నార్త్ ఇండియా మార్కెట్ ని మెయిన్ అనుకుని దిగటమే కారణం అని తెలుస్తోంది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. “హనుమాన్” టీజర్ విడుదల కాగానే హిందీ మార్కెట్ నుంచి ఎంక్వరీలు మొదలయ్యాయి. దాంతో, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి నార్త్ ఇండియన్ మార్కెట్ లో భారీగా క్రేజ్ ఉంటుందని గ్రహించి సినిమా విడుదల తేదీని 8 నెలలు పోస్ట్ పోన్ చేశారు. చిన్న సినిమాని పెద్ద సినిమాగా డిజైన్ చేసేందుకు అంత గ్యాప్ తీసుకున్నారు. ఈ నెల 12న తెలుగు, తమిళం, హిందీ, ఇలా అనేక భాషల్లో విడుదల కానుంది. ఐతే, అసలు ఫోకస్ మాత్రం తెలుగు, హిందీ మార్కెట్లే. ముఖ్యంగా నార్త్ ఇండియన్ మార్కెట్ పై టీం “హనుమాన్” చాలా ధీమాగా ఉంది. 1500 థియేటర్స్ ఇప్పిటకే నార్త్ ఇండియా మార్కెట్ లో ఈ సినిమా రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

దానికి తోడు ఇండియాలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మూడ్ మొదలైంది. నార్త్ ఇండియాలో “రామ్ మందిర్” అనేది ఒక ఎమోషన్ . అందుకే, “హనుమాన్” చిత్రంకి నార్త్ ఇండియాలో బాగా క్రేజ్, డిమాండ్ ఉంటుంది. బయ్యర్లు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది.  అయినా “కార్తికేయ 2” తర్వాత ఏ తెలుగు మీడియం చిత్రం పాన్ ఇండియా లెవల్లో ఆడలేదు. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో రీసెంట్ తెలుగు సినిమాలు పెద్దగా ఏవీ సందడి చెయ్యలేదు. “హనుమాన్” నార్త్ ఇండియన్ మార్కెట్ లో మరో “కార్తికేయ 2” అవొచ్చు అని అంటున్నారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ... మా సినిమా విడుదలను వాయిదా వేయాలని పలువురు అడిగారు. నాకు ఏమాత్రం ఛాన్స్‌ ఉన్నా వేరే డేట్‌కు వెళ్లేవాడిని. అందులో ఎలాంటి ఇగో లేదు. హిందీ మార్కెట్‌ ఇప్పుడు మాకెంతో ముఖ్యం. నార్త్‌లో మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న వాళ్లు.. రెండు నెలల క్రితమే సినిమా చూశారు. ఈ సినిమాపై మా కంటే వాళ్లకే ఎక్కువ నమ్మకం ఉంది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటూ ఉత్తరాదిలో భారీగా ప్రమోట్‌ చేస్తున్నారు. రిలీజ్‌ వాయిదాకు వాళ్లు అంగీకరించలేదు. అందుకే మేము అనుకున్న తేదీకే విడుదల చేస్తున్నాం’’ అని ప్రశాంత్‌ వర్మ క్లారిటీ ఇచ్చారు. నిర్మాత సహకారంతోనే సినిమాను ఈ స్థాయిలో తీర్చిదిద్దగలిగానని తెలిపారు  

ఇక  ఈ చిత్రం నైజాం రైట్స్ ని మైత్రీ మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. ఈ రైట్స్ నిమిత్తం ₹7.2 కోట్లు వెచ్చించి తీసుకున్నట్లు సమాచారం. ఓ రకంగా దిల్ రాజు నుంచి నైజాం ఏరియా సినిమాలు మెల్లిగా మైత్రీ వారు సొంతం చేసుకుంటన్నట్లు అర్దమవుతోంది. ఇన్నాళ్లూ మోనీపలిగా ఉన్న దిల్ రాజుకు మైత్రీ కౌంటర్ ఇస్తోందని అంటున్నారు. ఇక మైత్రీవారు ఈ రేటు ఇవ్వటంతో మిగతా ఏరియాలు కూడా మంచి రేట్లకు బిజినెస్ అవుతున్నాయి. రీసెంట్ గా మైత్రీవారు ప్రభాస్ సలార్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక ఇప్పటికే ఈ చిత్రం  టీజ‌ర్, ట్రైల‌ర్‌, పాట‌లు ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచేశాయి. ఇప్పుడు మ‌రో రవితేజ వాయిస్ మరో ఎట్రాక్షన్ చేరింది.  ఈ సినిమాలో కోటి అనే కోతి  పాత్ర ఒక‌టి ఉంది. సినిమా అంత‌టా ఈ కోతి పాత్ర ఉంటుంది. ఈ పాత్ర‌కు ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వటం హైలెట్ గా చెప్తున్నారు. ఈ పాత్ర‌, ర‌వితేజ గొంతులోని ఫన్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొంటాయ‌ని చిత్ర‌ టీమ్   చెబుతోంది. 

మరో ప్రక్క 2024 సంక్రాంతికు పోటీ ఓ రేంజిలో ఉంది. సంక్రాంతి రిలీజ్ కోసం  తెలుగు స్టార్ హీరోలంతా తమ సినిమాలతో ఆల్రెడీ కర్ఛీప్ వేసేసారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం”, విక్టరీ వెంకటేష్ “సైంధవ్”, రవితేజ లేటెస్ట్ మూవీ “ఈగల్”, కింగ్ నాగార్జున “నా సామి రంగ”, తేజ సజ్జ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “హనుమాన్” వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. అయితే బయ్యర్లు మాత్రం గోలెత్తిపోతున్నారు. మరో ప్రక్క థియేటర్స్ సమస్య వస్తుంది. నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios