తేజ సజ్జ ‘హనుమాన్’ (HanuMan), మహేశ్ బాబు ‘గుంటూరుకారం’ ఓకే రోజున విడుదల కాబోతున్నాయి. డేట్ మార్చే విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఏమాత్రం అలాంటి ఆలోచన లేదని చెప్పుకొచ్చారు.
సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల సందడి మొదలైంది. ప్రమోషన్స్ లో బిజీ అవుతున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సంక్రాంతికి పోటీ భారీగానే ఉండనుంది. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) లేటెస్ట్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) కూడా ఉంది. ఈ భారీ చిత్రంతో 2024 జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అదే రోజు యువ హీరో తేజా సజ్జ (Teja Sajja) నటించిన సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’ (HanuMan) కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏకంగా సూపర్ స్టార్ సినిమాతోనే పోటీగా రిలీజ్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు ఈ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుందని, మరో డేట్ ను లాక్ చేసుకుంటుందని అంతా భావించారు. కానీ, ఈ రోజు జరిగిన HanuMan Trailer Event లో దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) క్లారిటీ ఇచ్చారు... రిలీజ్ డేట్ మార్చే విషయంపై ఆసక్తికరంగా స్పందించారు. ‘మహేశ్ బాబు నా ఫేవరెట్ హీరో. నేను ఆయన అభిమానిని. గుంటూరుకారం ఫస్ట్ డే తప్పకుండా చూస్తాను. సూపర్ స్టార్ సినిమాతో పోటీ పడటం లేదు. కానీ మాకు మరో డేట్ లేకపోవడంతో జనవరి 12నే వస్తున్నాం.
మేమ్ ఆ డేట్ ఫిక్స్ చేసినప్పుడు ఎవరూ రాలేదు. కానీ సడెన్ గా ‘గుంటూరు కారం’ కూడా అదే డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇతర భాషల్లోనూ రిలీజ్ కు అగ్రిమెంట్ అయ్యిపోయింది. ప్రస్తుతం సినిమాను వాయిదా వేసే ఆలోచనలు ఏం లేవు. కానీ సినిమాపై మాకు నమ్మకం ఉంది. హనుమాన్, తేజ సజ్జ యాక్షన్, బ్యూటీఫుల్ సీన్ల కోసం ఆడియెన్స్ థియేటర్లకు వస్తారు. ఇది రెండు మూడు రోజుల్లో పోయే సినిమా అయితే కాదు. రిపీటెడ్ ఆడియెన్స్ ను సాధిస్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకు ‘హనుమాన్’ నుంచి వచ్చిన అన్నీ అప్డేట్లకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా విజువల్ వండర్ గా నిలిచింది. దీంతో సినిమాపై హైప్ పెరిగింది. మరోవైపు గుంటూరు కారం నుంచి వరుసగా సాంగ్స్ వస్తూనే ఉన్నాయి. సాలిడ్ అప్డేట్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక హనుమాన్ ‘గుంటూరుకారం’తో ఎలా పోటీ పడుతుందో చూడాలంటున్నారు.
