తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది.
సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన హనుమాన్ హంగామా భాక్సాఫీస్ దగ్గర ఇంకా కొనసాగుతూనే ఉంది. 92 ఏళ్ళ తెలుగు సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ చరిత్రలో హనుమాన్ సృష్టించిన రికార్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అండర్ డాగ్ గా పెద్దగా ఎవరూ పట్టించుకోని స్దితిలో రిలీజైన హనుమాన్ సినిమా స్టార్ హీరోలతో పోటీలో విన్నర్ గా ఎమర్జ్ అయ్యింది. మొదిటి రోజు నుంచే క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ బిజినెస్ ఇప్పటికి క్లోజ్ అయ్యింది. మొదటి వారంలో తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా… మూడో రోజు నుంచి థియేటర్స్ కౌంట్ పెంచుకోని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఈ రేంజ్ హిట్ ఊహించి ఉండరు. అమలాపురం టు అమెరికా వరకు హనుమాన్ పై కాసుల వర్షం కురుసింది. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియావైజ్ చూద్దాం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...నైజాంలో, ఈ చిత్రం 64 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా 82 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 24 కోట్ల గ్రాస్. కేరళ- తమిళనాడులో కలిపి దాదాపు 4 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. నార్త్ ఇండియాలో ఈ సినిమా 62 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా 237 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్ లో 57 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ గ్రాస్ 294 కోట్లని చెప్పుకోవచ్చు. ఈ సినిమా టాలీవుడ్‌లో టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది.

తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని, పిల్లలను , విపరీతంగా ఆకట్టుకుంది. హనుమాన్ సినిమా భారతీయ భాషలైన తెలుగు, హిందీ, మరాఠీ,తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లోనూ రిలీజ్ అవటం విశేషం. ఈ మూవీని నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. హరి గౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు.
మరో ప్రక్క హనుమాన్ సినిమా OTT విడుదల తేదీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మార్చి 8న జీ5లో రాబోతోంది. ఈ సినిమా సీక్వెల్ గా జై హనుమాన్ అని ఇప్పటికే ప్రకటించడంతో OTT రెస్పాన్స్ కూడా ఈ చిత్ర బృందానికి చాలా కీలకం. జై హనుమాన్ సినిమా పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో రానుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. శ్రీరామ నవమికి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉంది.
