Hanuman Ansh: విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన 'హనుమాన్ అన్ష్' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ డివోషనల్ డ్రామా 55 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 420 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది.

భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న సినిమా..

విశాల్ చతుర్వేది స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'హనుమాన్ అన్ష్' సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిర్మాతలు కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. కానీ, రిలీజైన 55 రోజుల్లోనే ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 420 కోట్లు వసూలు చేసింది. దర్శకుడు విశాల్ చతుర్వేది.. హనుమాన్ భక్తుడు, హిందూ గురువు అయిన నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఆగస్టు 7న ఈ డివోషనల్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సైలెంట్ హిట్‌గా నిలిచింది.

కేవలం 10 లక్షల ఓపెనింగ్స్‌తో మొదలై

ఆగస్టు 7న రిలీజైన రోజున ఈ సినిమా కేవలం 10 లక్షల ఓపెనింగ్స్‌తో మొదలైంది. కానీ మౌత్ టాక్ బాగుండటంతో కలెక్షన్లు అమాంతం పుంజుకున్నాయి. ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ లెక్కల ప్రకారం, ఈ సినిమా తొలి రోజు 1.08 కోట్లు రాబట్టింది. నెల రోజులు గడిచేసరికి ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్లు 61 కోట్లకు చేరుకున్నాయి. నీమ్ కరోలీ బాబా గురించి డాక్టర్ విశాల్ చతుర్వేది స్వయంగా రాసిన 'డివైన్ డిటూర్: దట్ చేంజ్డ్ మై లైఫ్' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించారు.

ఎవరెవరు నటించారంటే?

చందన్ కే ఆనంద్, అనిల్ రస్తోగి, నిఖిల్ దూబే, భగవాన్ దాస్ పటేల్, నేఘా పరాంజపే, ఉదయ్ సింగ్ రాజ్‌పుత్, పూర్ణిమ తివారీ, గౌతమ్ త్రిపాఠి, గుల్షన్ పాండే, రాజీవ్ మిశ్రా, రిషికేష్ దూబే, విహాన్ షెడ్గే, సాద్విక్ శర్మ, అలెక్సీ డానిరోవ్, సంతోష్ దీక్షిత్, బ్రిజ్‌పాల్ సింగ్, యష్ పాండే, అమన్ మెహతా, రజనీష్ శ్రీవాస్తవ, అభిషేక్ మిశ్రా తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. స్వయంభూ మీడియా నెట్‌వర్క్, హోలీ కౌ హోమ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. విశాల్ బావా సినిమాటోగ్రఫీ అందించగా, శంఖ్ రాజ్యాధ్యక్ష ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు.