Asianet News TeluguAsianet News Telugu

వింటానికి బాగానే ఉంది, కానీ ఏదో తేడా కొడుతోందే

 ఆమె ప్రధాన పాత్రలో రెడీ అయిన ‘105 మినిట్స్’ గ్లింప్స్‌  రిలీజైంది.

Hansika to star in an innovative flick '105 Minutes'
Author
Hyderabad, First Published Nov 8, 2021, 8:01 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రయోగాలు ఖచ్చితంగా చెయ్యాల్సిందే. కొత్త నీరు ఇండస్ట్రీకి రావాల్సిందే అని అందరూ కోరుకుంటారు. అయితే ప్రయోగం పేరట ,కొత్తదనం పేరు చెప్పి  విసుగెత్తించే కంటెంట్ ని మాత్రం ఎవరూ కోరుకోరు.  తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన హన్సికకు కొంతకాలంగా సక్సెస్ అనేది లేదు. ఆమె కెరీర్ లో సరైన సినిమా గత కొన్నేళ్లుగా లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కనపడటం లేదు. ఈ క్రమంలో ఆమె చేస్తున్న సినిమాలు చూస్తూంటే అభిమానులు సైతం కంగారుపడుతున్నారు.  

తాజాగా హన్సిక.... మహా, పార్ట్‌నర్, 105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శ్రుతి, రౌడీ బేబీ వంటి సినిమాలు చేస్తోంది. వీటిలో చెప్పుకోదగిన సినిమా ఒక్కటీ లేదు.  తాజాగా దీపావళి సందర్భంగా ఆమె ప్రధాన పాత్రలో రెడీ అయిన ‘105 మినిట్స్’ గ్లింప్స్‌  రిలీజైంది. ఇది చూసిన వాళ్లు ఎంతో ఎక్సపెక్ట్ చేసుకుంటే..ఇదేంటి మళ్లీ పాత కంటెంట్ తోనే వస్తున్నారు అంటున్నారు. ఈ సినిమా మొత్తంలో ఒకే ఒక్క క్యారెక్టర్ అంటే హన్సిక మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి సింగిల్ క్యారెక్టర్‌‌తో వచ్చే సినిమాల్లో అన్నిట్లోనూ ఏం జరుగుతుందో ఈ సినిమాలోనూ అదే జరుగుతోందనిపిస్తోంది.

  ఈ సినిమాలోనూ హన్సిక ‌ ఎక్కడో బందీ అయిపోతుంది. ఆమెని ఎవరో వ్యక్తి , ఏదో శక్తి  భయపెడుతూ ఉంటుంది. ఆ విచిత్రమైన పరిస్థితుల్ని ఆ క్యారెక్టర్ ఎలా ఎదుర్కొంటుంది అనేదాని చుట్టూనే సినిమా నడుస్తుందని అర్దమవుతోంది. ఇలాంటి కథలు తెరపై చాలా వచ్చాయి.తెలుగులోనూ వచ్చాయి.  మరి ఇందులో కొత్తదనం ఏముందో రిలీజ్ అయ్యితే కానీ తెలియదు. ఇప్పటిదాకా చూసిన గ్లింప్స్ లో మాత్రం అలాంటిదేమీ లేదని అర్దమవుతోంది. మీరూ  ఓ లుక్కేయండి.


 
ఇక చిత్రం వివరాల్లోకి వెళితే...హన్సిక మొత్వాని హీరోయిన్ గా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా "సింగిల్ షాట్" "సింగిల్ క్యారెక్టర్" తో ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో తెరకెక్కుతోన్న చిత్రం '105 మినిట్స్'. రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు, సామ్ సి.యస్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలని వేగంగా జరుపుతుంది చిత్ర టీమ్.

Also read Bangarraju First Single promo: లడ్డుందా అంటోన్న నాగార్జున.. సోగ్గాడి సందడి షురూ 

ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. ఎలాంటి కట్స్ లేకుండా సింగిల్ షాట్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా మొత్తాన్నీ తీసేస్తున్నారు. అంతేకాదు.. సినిమాలో హన్సిక క్యారెక్టర్ ఒక్కటే కనిపిస్తుంది. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మైల్ స్టోన్‌‌‌‌‌‌‌‌గా నిలిచిపోయే సినిమా అంటున్నారు మేకర్స్.  టైటిల్‌‌‌‌‌‌‌‌కి తగ్గట్టే సినిమా 105 నిముషాల నిడివి ఉంటుంది. ఓ ఇంట్లో ఇరుక్కుపోయిన హీరోయిన్‌‌‌‌‌‌‌‌ స్ట్రగులే మెయిన్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది.

Also read Viswa Eliminated: బిగ్‌ బాస్ ‌5లో బిగ్‌ షాక్‌.. షణ్ముఖ్‌, రవి, ప్రియాంక, శ్రీరామ్‌లపై విశ్వ హాట్‌ కామెంట్‌
 

Follow Us:
Download App:
  • android
  • ios