హన్సిక ఇప్పుడు తెలుగులో ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తుంది. తన 53వ చిత్రంగా `105 మినిట్స్` అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఇది రియల్‌ టైమ్‌ సింగిల్‌ షాట్‌ మూవీ.

పాలబుగ్గల సుందరి, బబ్లీ గర్ల్‌ హన్సిక మోత్వాని త్వరలో `మహ` చిత్రంతో రాబోతుంది. మరోవైపు నటిగా సినిమా ఎంపికలో తన పంథాని మార్చుకుంది. క్రమంగా లేడీ ఓరియెంటెడ్‌, హీరోయిన్‌ పాత్రలకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటుంది. అందులో భాగంగా హన్సిక ఇప్పుడు తెలుగులో ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తుంది. తన 53వ చిత్రంగా `105 మినిట్స్` అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఇది రియల్‌ టైమ్‌ సింగిల్‌ షాట్‌ మూవీ. కేవలం ఒకే ఒక పాత్ర ఉంటుంది. 

హన్సిక ప్రధాన పాత్రతో ఈ సినిమా రూపొందుతుంది. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. ఎడిటింగ్‌ లేకుండా ఒకేషాట్‌లో ఈ సినిమాని చిత్రీకరించబోతున్నారు. సైకాలజికల్‌ థ్రిల్లర్‌గా ఒకే ఇంట్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. సినిమా నిడివి కూడా 105 నిమిషాలే కావడం మరో విశేషం. మరి సింగిల్‌ షాట్‌లో, సింగిల్‌ క్యారెక్టర్‌గా హన్సిక ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఇది సాధ్యమవుతుందా? ఈ సాహసాన్ని చేసి సత్తా చాటుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. 

Scroll to load tweet…

ప్రస్తుతం హన్సిక మెయిన్‌ లీడ్‌ చేసిన `మహ` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళంలో ఇది త్వరలోనే రిలీజ్ కాబోతుంది. కొత్తగా మరో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యింది మరోవైపు మధ్య మధ్యలో స్పెషల్‌ వీడియో సాంగ్‌ల్లోనూ మెరుస్తుంది హన్సిక. హిందీలో చేసిన `మాజా` సాంగ్‌ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే.