అప్పడెప్పుడో కెరీర్ మొదట్లో అల్లు అర్జున్ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దేశముదురు టైటిల్ తో తెరకెక్కిన ఆ చిత్రం ఘన విజయం సాధించింది. హన్సికకు మంచి మార్కెట్ తెచ్చి పెట్టింది. అయితే ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.

ఆ తర్వాత హన్సిక బిళ్లా, కంత్రి, మస్కా, ఓ మై ప్రెండ్, పవర్, గౌతమ్ నంద వంటి చిత్రాలు చేసినా ఆ స్దాయి సక్సెస్ రాలేదు. దాంతో ఆమె తమిళంలో సినిమా చేస్తూ బిజీగా ఉంటోంది.  అప్పడప్పుడూ మంచు విష్ణు వంటి హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ తెలుగులో కనిపిస్తోంది. అయితే హన్సిక తెలుగులో ఓ సినిమా చెయ్యబోతోందని, అదీ అల్లు అర్జున్ సరసన అని సమాచారం.

అయితే అల్లు అర్జున్ సినిమాలో ఆమెది రెగ్యులర్ హీరోయిన్  పాత్ర కాదని, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను ఎప్రోచ్ అయ్యారని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తమిళ సినీ వర్గాల సమాచారం. వేణు శ్రీరామ్ చిత్రంలో ఆమె చేయబోతోందని అంటున్నారు. ఐకాన్ అనే టైటిల్ తొ రూపొందే ఈ చిత్రంలో ఆమె పాత్ర స్పెషల్ గా ఉంటుందని, అందుకే కమిటైందని అంటున్నారు.

ఇక హన్సిక అయితే బెస్ట్ ఆఫ్షన్ అని అల్లు అర్జున్ కూడా భావించాడంటున్నారు. ఇక వేణు శ్రీరామ్ తొలి చిత్రం ఓ మై ఫ్రెండ్ లో ఆమె ఓ హీరోయిన్ గా నటించింది. ఆ పరిచయంతో ఎప్రోచ్ అయ్యారని అంటున్నారు. ఏదైమైనా హన్సిక మళ్లీ తెలుగులో పెద్ద హీరోతో చేయటం సంతోషకరమైన విషయమే కదా.