రోబో గెటప్‌లో కళ్లు ఏమాత్రం కదపకుండా రెండుమూడు నిమిషాల పాటు అలాగే ఉండిపోవడం ఓ సవాలుగా అనిపించింది. ఈ సిరీస్‌ నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 


ప్రపంచం అంతా ఓ తాటి మీదకు వచ్చి గ్లోబులైజేషన్ అయ్యిపోయాక ఎక్కడెక్కడి సినిమాలు, వెబ్ సీరిస్ లు మనవాళ్లు చూస్తున్నారు. అలాగే వాటిలో నచ్చినవి కాపీ కొడుతూ వస్తున్నాయి.అయితే ఇప్పుడు సీన్ మారింది. కాపీ కొడితే దొరికిపోతున్నారు. అందుకే రైట్స్ తీసుకుని మరీ చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఓ కొరియన్ వెబ్ సీరిస్ ని రైట్స్ తీసుకుని హన్సిక తో చేస్తున్నారు.

View post on Instagram

ఆ వెబ్ సీరిస్ పేరు ‘మైత్రీ’. ఈ వెబ్ సీరిస్ తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠి, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పోస్టర్ ద్వారా ఈ వెబ్ సీరిస్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇందులో హన్సికాను సగం ఏఐ రోబోట్‌గా, మిగతా సగం మనిషిగా కనిపిస్తోంది. నటుడు మ్యుగెన్ చేతులకు గ్లవ్స్ ధరించి కనిపించాడు. ఇప్పటికే ఈ సీరిస్ టీమ్.. ఇది ఒక రోబోటిక్ లవ్ స్టోరి అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హన్సిక రెండు భిన్న మైన పాత్రలు నటించనున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్ర మైత్రీగా, మరొక పాత్ర MY3 రోబోట్ అని తెలుస్తోంది. 

మీడియావర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... కొరియా పాపులర్ టీవీ షో ‘ఐ యామ్ నాట్ ఎ రోబోట్’ మూవీకి ఈ సీరిస్ రీమేక్ . సీరిస్ కథేమిటంటే...బాగా డబ్బున్న హీరో అరుదైన అలర్జీతో బాధపడుతుంటాడు. మనుషులను తాకితే అతడి శరీరమంతా అలర్జీకి గురవ్వుతుంది. అది ఎక్కువైతే ప్రాణాలకే ప్రమాదం. అందుకే చేతులకు గ్లోవ్స్‌ తొడుగుతాడు. మనుషులను దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేకపోవడంతో అతడి పనులు చేయడానికి మనిషి లాంటి రోబోను తయారు చేయాలని సైంటిస్ట్‌ టీమ్‌కు చెబుతాడు. వారు ఓ అమ్మాయి రూపాన్ని తీసుకుని రోబో చేస్తారు. సరిగ్గా డెలివరీ చేసే సమయానికి రోబోట్ పనిచేయదు. దీంతో ఆందోళన గురైన రోబో తయారీ టీమ్.. ఆ రోబోట్ రూపంలో ఉండే అమ్మాయిని హీరో ఇంటికి పంపిస్తారు. అయితే ఆ అమ్మాయిని చూసి ఆ హీరో రోబో అనే అనుకుంటాడు. ఆ తర్వాత రోబోతో ప్రేమలో పడతాడు. ఇంటికి వచ్చి మైత్రీ రోబో కాదని తెలిసి హీరో ఎలా స్పందిస్తాడు? చివరికి ఏం జరిగింది అనేదే కథ.

ఈ సిరీస్‌ గురించి హన్సిక మాట్లాడుతూ ‘నా కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన పాత్ర ఇది. స్క్రిప్ట్‌ చదివినప్పుడు చాలా సాధారణంగానే అనిపించింది. సెట్స్‌ మీదకు వెళ్లాక అసలు కష్టమేమిటో తెలిసొచ్చింది. రోబో గెటప్‌లో కళ్లు ఏమాత్రం కదపకుండా రెండుమూడు నిమిషాల పాటు అలాగే ఉండిపోవడం ఓ సవాలుగా అనిపించింది. ఈ సిరీస్‌ నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. షూటింగ్‌ వెళ్లేముందు కొరియన్‌ సిరీస్‌ను చూడమని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ నాకు ఇష్టం లేదు. నాదైన సహజమైన నటన కనబరచాలని ఆ సిరీస్‌ను చూడలేదు’ అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఈ సీరిస్ మొత్తం కామెడీగా, ఎమోషనల్‌గా సాగుతుంది. మరి, హన్సిక సీరిస్ కూడా అదే కథతో వస్తున్నట్లయితే.. తప్పకుండా నచ్చుతుంది. ‘ఐ యామ్ నాట్ ఎ రోబోట్’ టీవీ షో ఇప్పుడు ‘జియో సినిమా’, ‘MX’ ప్లేయర్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది. ‘My3’ మూవీకి ‘ఓకే ఓకే’ మూవీ డైరెక్టర్ రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సీరిస్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠి, హిందీ భాషల్లో ఈ సిరీస్‌ను విడుదల చేస్తున్నారు.