పుట్టినరోజు వేడుకలు పిల్లలతో జరుపుకున్న హన్సిక తనపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన హన్సిక తెలుగు, తమిళం రెండు తనకు రెండు కళ్లంటున్న హన్సిక

అందాల భామ హన్సిక ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. పిల్లల మధ్య జరుపుకుని సోషల్ మీడియాలో ఆ ఫోటోలు అప్ లోడ్ చేసింది. అంతేకాదు పనిలో పనిగా తనకు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. కోలీవుడ్‌లో హన్సికను అందరూ ‘టైంబాంబ్‌’ అంటారట! టైంబాంబ్‌ అంటే డేంజర్‌ అని కాదట! షూటింగ్‌లకి టైముకి వస్తుంది కనుక అందరూ తనను టైంబాంబ్‌ అంటారట! షూటింగ్‌కి అందరికన్నా ఓ పది నిమిషాలు ముందే ఉంటుందట.

పిల్లల మధ్య పుట్టినరోజు వేడుక జరుపుకున్న హన్సిక... ఈ సందర్భంగా తీసిన ఫోటోలను పోస్ట్‌ చేసింది. ఇక కోలీవుడ్‌ మీద చూపించినంత ప్రేమను టాలీవుడ్‌ మీద చూపించడం లేదు అన్న విమర్శలను కూడా హన్సిక తిప్పి కొట్టింది. తనకు కోలీవుడ్‌, టాలీవుడ్‌ రెండు కళ్ళలాంటివనీ, అందులో ఏ కంటినీ నిర్లక్ష్యం చేయనని అంటోంది. కాకపోతే కోలీవుడ్‌లో ఒప్పుకున్న సినిమాలు ఉండడంతో టాలీవుడ్‌లో డేట్లు ఇవ్వడం కుదరడం లేదట! కాకపోతే టాలీవుడ్‌లో తనకు ఎవరూ ఛాన్సులు ఇవ్వడం లేదన్న విషయాన్ని హన్సిక ఇలా చక్కగా కవర్‌ చేస్తోందని సినీ జనాలు అంటున్నారు.