సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ లు చాలా కామన్. ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే డేటింగ్, బ్రేకప్ లు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

అసలు విషయంలోకి వస్తే.. ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద కుటుంబం నుండి  హీరోయిన్ గా పరిచయమైంది ఓ బ్యూటీ. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. రీసెంట్ గా ఓ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించింది. ఈ సీనియర్ నటి చాలా కాలంగా ఓ కుర్ర హీరోతో డేటింగ్ చేస్తోంది.

వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్. ఈ మధ్యకాలంలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఎన్నో ఏళ్లుగా సీక్రెట్ గా మైంటైన్ చేసన రిలేషన్ ఒక్కసారిగా బయట ప్రపంచానికి తెలిసింది. అయినప్పటికీ ఈ ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోయినట్లు సమాచారం.

సదరు కుర్రహీరో తిరిగి తన తల్లితండ్రుల దగ్గరకి వచ్చేశాడట. ఆ హీరోయిన్ తన ఇంట్లో ఒంటరిగానే ఉంటోందట. ఒకరికొకరు ఎదురుపడినా.. కనీసం పలకరించుకోవడం లేదట. ఇలాంటి పరిస్థితికి దారి తీసిన సంఘటనలు ఏంటనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. కొన్ని కథలకు అంతే.. హ్యాపీ ఎండింగ్స్ ఉండవు.