Asianet News TeluguAsianet News Telugu

కల్కి బడ్జెట్ లో సగం దానికే... అవుట్ ఫుట్ సంగతేంటి?

ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2829 AD మూవీ బడ్జెట్ లో దాదాపు సగం రెమ్యూనరేషన్ ప్రధాన నటుల రెమ్యూనరేషన్ కే పోతుందట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ వారాల్లో చక్కర్లు కొడుతుంది. 

half of the kalki 2829 ad budget for main cast remunerations ksr
Author
First Published Feb 23, 2024, 3:57 PM IST | Last Updated Feb 23, 2024, 3:57 PM IST


మహానటి మూవీతో భారీ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్... ఈసారి సైన్స్ ఫిక్షన్ ఎంచుకున్నాడు. పెద్దగా అనుభవం లేకున్నా... సాహసానికి పూనుకున్నాడు. టాలీవుడ్ లో ఇంత వరకు స్టార్ హీరోస్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేసింది లేదు. ఒకటి రెండు ఉన్నా... ఉన్నత ప్రమాణాలతో, హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించింది లేదు. టాలీవుడ్ కి ఉన్న మార్కెట్ రీత్యా సత్తా ఉన్నా... వందల కోట్ల బుడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రాలు చేయలేము. కొన్నాళ్లుగా సమీకరణాలు మారాయి. తెలుగు సినిమాలు వేల కోట్లు కొల్లగొడుతున్నాయి. 

కాగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2829 AD  మూవీలో ప్రభాస్ హీరో. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కాగా ఈ బడ్జెట్ లో సగం ప్రధాన పాత్రలు చేస్తున్న నటుల రెమ్యూనరేషన్ కే సరిపోతుందని టాక్. ప్రభాస్ ఈ చిత్రానికి రూ. 150 కోట్లు తీసుకుంటున్నారట. ఆయన పెద్ద మొత్తంలో డేట్స్ కేటాయించిన నేపథ్యంలో ఆ రేంజ్ లో తీసుకుంటున్నారు. 

ఈ ప్రాజెక్ట్ లో కమల్ హాసన్ ని ఇన్వాల్వ్ చేశారు. కోలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా కమల్ హాసన్ వలన హైప్ ఏర్పడుతుంది. అందుకు కీలక రోల్ కోసం ఆయన్ని ఎంచుకున్నారు. కమల్ హాసన్ కి రూ. 60 నుండి 70 కోట్లు ఇస్తున్నారట. ఇక దేశంలోనే టాప్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకొనె రూ. 25 కోట్లు తీసుకుందట. కాబట్టి కల్కి బడ్జెట్ లో అధిక భాగం రెమ్యూనరేషన్స్ కే పోతుంది. దిశా పటాని, అమితాబ్ సైతం కోట్లలో తీసుకునే ఆర్టిస్ట్స్. 

మరి భారీ బడ్జెట్ నిర్మాణానికి ఎంత కేటాయించారు అనే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో కల్కి అవుట్ ఫుట్ పై అనుమానాలు కలుగుతున్నాయి. ఇక కల్కి సమ్మర్ కానుకగా మే 9న విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఒక ప్రక్క షూటింగ్ జరుగుతుండగా... మరో ప్రక్క డబ్బింగ్, విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios