Asianet News TeluguAsianet News Telugu

Ammaadi : ‘హాయ్ నాన్న’ సెకండ్ సాంగ్ విన్నారా.. బ్యూటీఫుల్ లిరిక్స్..

నాని ‘హాయ్ నాన్న’ మూవీ సాంగ్స్ బ్యూటీఫుల్ గా ఉంటున్నాయి. సంగీత ప్రియులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికే మొదటి పాట ఆకట్టుకోగా.. రెండో పాటనూ యూనిట్ విడుదల చేసింది. 
 

Hai Nanna Second Single Ammaadi Out Now  NSK
Author
First Published Nov 4, 2023, 2:33 PM IST | Last Updated Nov 4, 2023, 2:33 PM IST

నేచురల్ స్టార్ నాని (Nani)   లేటెస్ట్ ఫిల్మ్ ‘హాయ్ నాన్న’ (Hai Nanna). ఈ చిత్ర ప్రమోషన్స్ ను యూనిట్ ఆసక్తికరంగా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ మెటీరియల్ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు సాంగ్స్ తోనూ మూవీని మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండటం విశేషం కాగా.. ‘హాయ్ నాన్న’కు బ్యూటీఫుల్ కంపోజింగ్ ను అందించారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ‘సమయమా’ సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. మెలోడీ అండ్ ఎమోషనల్ ట్రాక్ కు సంగీత ప్రియులు ఫిదా అయ్యారు. యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ అవుతోంది. ఈ క్రమంలో మరో బ్యూటీఫుల్ సాంగ్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ‘హాయ్ నాన్న’ సెకండ్ సింగిల్ గా Ammaadi టైటిల్ తో వచ్చిన ఈ పాట అద్భుతంగా ఉంది. భర్తకోసం డెడికేట్ చేస్తూ రూపొందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా లిరిక్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను దక్కించుకుంటోంది. 

‘హాయ్ నాన్న’ సెకండ్ సింగిల్ కు మధన్ కార్కీ అద్బుతమైన లిరిక్స్ అందించారు. ఒక్కో లైన్ లవ్ బర్డ్స్, కపుల్స్ హృదయాలను టచ్ చేసేలా ఉండటం విశేషం. స్టార్ సింగర్ కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ తమ గాత్రంతో మంత్రముగ్ధులను చేశారు. ఇక సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన మెలోడీ ట్యూన్ క్యాచీగా ఉండటంతో మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 

రోటీన్ భిన్నంగా కథలను ఎంచుకుంటూ వస్తున్న నాని..  చివరిగా‘దసరా’తో మాస్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం బ్యూటీఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్ తో ప్రేక్షకులను అలరించేందుకు ‘హాయ్ నాన్న’ చిత్రంతో వస్తున్నారు.  ఈ చిత్రానికి శౌర్యూవ్ దర్శకుడు. బేబీ కియారా ఖన్నా నాని కూతురు. క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  కథానాయిక. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో గ్రాండ్ గా డిసెంబర్ 7న విడుదల కాబోతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios