ఎన్టీఆర్‌ కొత్త సినిమా అప్‌డేట్‌ కోసం ఆయన అభిమానులు ఈగర్‌ వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తున్న ఎన్టీఆర్‌.. దీంతోపాటు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తన 30వ చిత్రం రూపొందనుంది. దీన్ని హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించనున్నారు. సూర్య దేవర నాగవంశీ కో ప్రొడ్యూసర్‌. 

ఈ సినిమా ప్రకటించినప్పట్నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో అభిమానులు ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకి `అయినను పోయిరావలెను హస్తినాకు` అనే టైటిల్‌ వినిపిస్తుంది. సినిమా ప్రకటించినప్పట్నుంచి ఇదే టైటిల్‌ వినిపిస్తుంది. దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. దీంతో ఫ్యాన్స్ అప్‌ డేట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 

దీంతో తాజాగా దీనిపై సహ నిర్మా సూర్యదేవర నాగవంశీ స్పందించారు. `తారక్‌ అన్న ఫ్యాన్స్.. మీ అందరి సందేశాలు స్వీకరించాం. సినిమా అప్‌డేట్‌, షూటింగ్‌ వివరాలు వెల్లడిస్తాం. ఆ వివరాలు, టైటిల్‌ విషయంలో మాకు కాస్త సెంటిమెంట్‌ ఉంది. అందుకే ముందుగా రివీల్‌ చేయలేము. ఈ సారి మమ్మల్ని నమ్మండి. మున్ముందు భారీ సర్‌ప్రైజ్‌ రాబోతుంది` అని ట్వీట్‌ చేశారు. 

గతంలో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్‌ కాంబినేషన్‌లో `అరవింద సమేత` వచ్చిన విషయం తెలిసిందే. ఇది రెండో చిత్రం కావడం విశేషం.