వాలంటైన్స్ మన్త్ ను టార్గెట్ చేశారు గుర్తుందా శీతాకాలం టీమ్. వచ్చేఏడాది పిబ్రవరిలో సినిమా రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. కాని డేట్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ లో పెట్టారు మేకర్స్.
టాలీవువుడ్ యంగ్ స్టార్ సత్యదేవ్(Satyadev)-మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah) జంటగా నటిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం(Gurthunda Seethakalam). కన్నడ సినిమా లవ్ మాక్ టెల్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను నాగశేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. మేఘ ఆకాశ్ గెస్ట్ రోల్ చేస్తున్న ఈ సినిమాను 2022 పిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నట్టు టీమ్ ప్రకటించారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయే సంఘటనలు చాలా ఉంటాయి. ముఖ్యంగా టీనేజ్,కాలేజ్ లైఫ్ లో జరిగిన చాలా విషయాలు మనుషులను గట్టిగా ప్రభావింతం చేస్తాయి. అటువంటి విషయాల అల్లికే Gurthunda Seethakalam మూవీ కథ. ఈ సినిమాను నాగ శేఖర్ డైరెక్ట్ చేస్తూ.. భావన రవితో కలిసి స్వయంగా నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
Also Read : HANUMAN FIRST LOOK : 5 భాషల్లో హనుమాన్.. కుర్ర హీరో బంపర్ ఆఫర్
వాలంటెన్స్ మన్త్ లో ప్రేమగా సినిమాను అందించడానికి మూవీ టీమ్ రెడీ అయ్యారు. పిబ్రవరిలో సినిమా రిలీజ్ అని పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కాని సినిమా రిలీజ్ పక్కా డేట్ ను అనౌన్స్ చేయలేదు మేకర్స్. ఈ సినిమాలో సత్యదేవ్-తమన్నా తో పాటు కావ్యాశెట్టి, సుహాసిని మణిరత్నం, తదితరులు కూడా నటిస్తున్నారు. సత్యదేవ్ తో తమన్నా నటించడంతో పాటు మేఘ ఆకాశ్ కూడా గెస్ట్ రోల్ చేస్తుండటంతో సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది.
