వెండితెరపై బుల్లితెర తారలు ఎంట్రీ ఇచ్చి.. చాలా మంది రాణిస్తున్నారు. స్టార్ హీరోలుగా మారినవారు కూడా ఉన్నారు. తాజాగా మరో బుల్లితెర స్టార్స్ సిల్వర్ స్క్రీన్ పై ప్రతాపం చూపించడానికి రెడీ అయ్యాడు. 

బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసి.. సీరియల్ హీరోలు గా పేరు తెచ్చుకుని.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చినవారు చాలా మంది ఉన్నారు. టీవీ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుని.. సినిమాల్లో స్టార్ హీరోలుగా మారినవారుఎందరో.. అంతెందుకు.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా సీరియల్ హీరోనే.. ఇక టాలీవుడ్ లో అయితే అలాంటివారు కోకొల్లలు. సుడిగాలి సుధీర్ లాంటిారు బుల్లితెరపై సందడి చేసి.. సిల్వర్ స్క్రీన్ లో హీరోలుగా ఎదిగినవారే.. ఇక తాజాగా మరో సీరియల్ నటుడు హీరోగా ఎంట్రీకి రెడీ అయ్యాడు. 

 గుప్పెడంత మనసు సీరియల్ తో హీరోగా మంచి గుర్తింపు సాధించాడు ముఖేష్ గౌడ. ముఖేష్ గౌడా అంటే ఎవరూ గుర్తు పట్టరు కాని.. రిషి అంటే మాత్రం అమ్మాయిల ముఖంలో ఓ మెరుపు మెరుస్తుంది. అంతలా టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ మనసుల్లో స్థానం సంపాధించాడు రుషీ. ఈ పాత్రలో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ కి ప్రస్తుతం మంచి ఆదరణ ఉంది. ఇక ముకేశ్ గౌడకి అమ్మాయిల్లో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ సీరియల్ హీరో సినిమా హీరోగా మారుతున్నాడు.

View post on Instagram

ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌గౌడ, ప్రియాంక శర్మ జంటగా కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా ద్వారా రుద్ర దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ గీతా శంకరం సినిమాలో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియాంక గతంలో తెలుగులో మెన్ టూ, తంతిరం.. అనే పలు సినిమాల్లో నటించింది.ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ ఈ సినిమాని నిర్మిస్తుండగా.. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి గీతా శంకరం అనే టైటిల్ ని ప్రకటించారు. ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ నెల 14 నుండి సినిమా షూటింగ్ మొదలవుతుందని ప్రకటించారు చిత్రయూనిట్.

ఈ సందర్భంగా ముకేశ్ గౌడ మాట్లాడుతూ.. ఈ దీపావళి కానుకగా నేను నటిస్తున్న మొదటి సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథకు నన్ను హీరోగా సెలక్ట్‌ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది లవ్‌ అండ్‌ ఎఫక్షన్‌తో కూడుకున్న సినిమా. సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో.. ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉంది. యూత్‌కు ఈ గీతా శంకరం సినిమా బాగా నచ్చుతుంది అని తెలిపారు.