Guntur Kaaram : ‘గుంటూరు కారం’ డబ్బింగ్ షురూ.! మ్యూజిక్ పై థమన్ క్రేజీ అప్డేట్
మహేశ్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా మూవీపై క్రేజీ అప్డేట్స్ అందాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) చివరిగా బ్యాంక్ దోపిడీల నేపథ్యంలో వచ్చిన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మూడోసారి ఆయన డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఆ చిత్రమే ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). 13 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషనల్ సెట్ అవడంతో ఇటు ఫ్యాన్స్, ఆడియెన్స్ తో పాటు మార్కెట్ లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అన్నీ సరిగా ఉంటే.. ఈ పాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా రూపుదిద్దుకుంటోంది. తాజాగా క్రేజీ అప్డేట్స్ అందాయి. అయితే మొన్నటి వరకు షూటింగ్ తోనే ‘గుంటూరు కారం’ టీమ్ బిజీగా కనిపించింది. కానీ ఉన్నట్టుండి ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. గుంటూరు కారం డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారంటూ దర్శకుడు త్రివిక్రమ్, ఇతర టీమ్ కలిసి ఉన్న ఫొటో వైరల్ గా మారింది. దీంతో సినిమా షూటింగ్ పూర్తైందా? లేకా ముందుగానే డబ్బింగ్ పనులు షురూ చేశారా? అనేది తెలియాల్సి ఉంది.
డబ్బింగ్ పనులు షురూ అనడంతో.. మహేశ్ అభిమానులు సంగీత దర్శకుడు థమన్ వైపు చూస్తున్నారు. అన్న గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ త్వరగా రిలీజ్ చేయండి అంటూ.. ఎక్స్(ట్విట్టర్) వేదికన ట్యాగ్ చేస్తున్నారు. ట్వీట్లతో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో థమన్ ఓ అభిమానికి స్పందిస్తూ క్రేజీ రిప్లై ఇచ్చారు. నవంబర్, డిసెంబర్, జనవరి అంతా మనదే.. గుంటూరు కారం మోతమోగాల్సిందే.. అంటూ అప్డేట్ అందించారు. అంటే వచ్చే నెల నుంచి వరుసగా థమన్ నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఏదేమైనా ‘గుంటూరు కారం’పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ కు ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. మహేశ్ లుక్, థమన్ బీట్, క్రేజీ కాస్టింగ్ తో సినిమాపై హైప్ భారీగానే ఉంది. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela), మరియు మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, జయరామ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మనందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారికా అండ్ హాసిని బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.