ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన సినిమా గుణ సుందరి. ఈమూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈమూవీ టీజన్ ఆడియన్స్ ను ఆకర్షిస్తుంది.
ప్రస్తుతం సమాజంలో అనేక రకాలు సంఘటనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో నేటి సొసైటీ పూర్తిగా మారిపోయింది. ఇక ఈ అంశాలతో యువతను ఆకార్శించే విధంగా ఓ మూవీ రూపొందుతుంది. మార్త క్రియేషన్స్ బ్యానర్ పై ఓం ప్రకాష్ మార్త ఈసినిమాకు దర్శకత్వం వహీస్తూ..స్వయంగా నిర్మిస్తున్నారు. గుణసుందరి కథ టైటిలో తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ తాజాగారిలీజ్ చేశారు మూవీ టీమ్.
ప్రస్తుత సామాజిక నేపథ్యానికి అద్దం పడుతూ ప్రేమ పెళ్లి లాంటి ఎన్నో ముఖ్యంశాలను బేస్ చేసుకుని.. థ్రిల్లర్ కథతో తెరకెక్కి ఆడియన్స్ ముందుకు రాబోతోంది గుణసుందరి కథ సినిమా. మరీ ముఖ్యంగా యువతను, మహిళలను ఆకట్టుకునే విధంగా ఈసినిమాను రూపొందించారు. నేటి యువతకు కావల్సి అన్నీ అంశాలు ఉన్న చిత్రం ఇది. ఇక ఈమూవీలో సునీత సద్గురు, ఆనంద చక్రపాణి, రేవంత్ త్రిలోక్, కార్తీక్ సాహస్, ఉదయ్ భాస్కర్, నరేంద్ర రవి, లలితా రాజ్,అక్షయ్ ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకర్శిస్తోంది. అంతా కొత్తవారు అయినా.. సినిమాపై టీజర ప్రభావంతో అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈసినిమాకు కథ మాటలు పాటలు కవి సిద్ధార్థ అందించగా. సంగీతం కళ్యాణ్ మోసెస్ అందించారు. సినిమాటో గ్రాఫర్ గా విజయ్ కుమార్ svk..ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా నాగరాజు గడమళ్ళ, కిషన్ కన్నయ, అనుదీప్ వ్యవహరించగా.. కో ప్రొడ్యూసర్ గా బొడ్డు సైదులు పనిచేశారు. ఇక గుణసుందరికథకు నిర్మాత, దర్శకుడిగా ఓం ప్రకాష్ మార్త.. మల్టీ టాలెంట్ చూపించారు.
