భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల కథని అపురూప ప్రేమ కావ్యంగా చూపించబోతున్నారు గుణశేఖర్.

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల కథని అపురూప ప్రేమ కావ్యంగా చూపించబోతున్నారు గుణశేఖర్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో శాకుంతలం ప్రమోషన్స్ గురించి గుణశేఖర్ స్వయంగా స్పందించారు. త్వరలోనే శాకుంతలం ప్రమోషన్స్ మొదలవుతాయని ట్విట్టర్ లో తెలిపారు. ఈ క్రమంలో గుణశేఖర్ తన కలల ప్రాజెక్ట్ 'హిరణ్యకశ్యప' పై చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. హిరణ్యకశ్యప చిత్రాన్ని గుణశేఖర్ రానా దగ్గుబాటితో తెరకెక్కించాలని ప్రయత్నించారు. 

ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. సురేష్ బాబు కూడా దీనిపై వర్క్ జరుగుతోంది అని పలు సందర్భాల్లో తెలిపారు. కానీ ఈ ప్రాజెక్ట్ పై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. జరుగుతోందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా గుణశేఖర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. 

'నేను ప్రామిస్ చేసిన విధంగా నారసింహ అవతారాన్ని హిరణ్యకశ్యప చిత్రంలో కనివిని ఎరుగని విధంగా చూపిస్తాయి. ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నాను. అంతకంటే ముందుగా శాకుంతలం చిత్రాన్ని విజువల్ వండర్ గా మీ ముందుకు తీసుకువస్తున్నాను. త్వరలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ మొదలవుతాయి అని గుణశేఖర్ అన్నారు. 

హిరణ్యకశ్యప చిత్రాన్ని మరొక ఆసక్తికరమైన కాంబినేషన్ లో తెరకెక్కించడం ఏంటి.. అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి నిర్మాతగా సురేష్ బాబు తప్పుకున్నారా ? రానా కూడా తప్పుకున్నాడా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తుంటే గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ కు అడ్డంకులు తప్పడం లేదు అని అర్థం అవుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో గుణశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. 

Scroll to load tweet…