సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ రకరకాల కారణాలతో కొన్నాళ్లకే ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోతుంటారు. గతంలో 'మన్మథుడు' ఫేం నటి అన్షు సడెన్ గా ఇండస్ట్రీకి దూరమైంది. పైన బికినీ ఫోటోలో కనిపిస్తున్న భామ కూడా రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీ నుండి అవుట్ అయిపోయింది.

ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..? నటి దీక్షాసేత్.. 2010లో 'వేదం' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించింది. ఆమె ఆఖరిగా నటించిన చిత్రం 'రెబెల్'. ఈ సినిమా తరువాత దీక్షా టాలీవుడ్ లో కనిపించలేదు.

ప్రస్తుతం ఈ బ్యూటీ ముంబైలో కొన్ని వ్యాపారాలు చేస్తోంది. అప్పుడప్పుడు తన స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి ట్రిప్ లకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో మాల్దీవ్స్ బీచ్ లో తీసుకున్న బికినీ ఫోటోని షేర్ చేసింది. ఇది చూసిన వారంతా అసలు దీక్షాయేనా అని షాక్ అయిపోతున్నారు. గుర్తుపట్టని విధంగా మారిపోయింది ఈ బ్యూటీ. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deeksha Seth (@deeksha721) on Mar 18, 2019 at 8:05am PDT