Asianet News TeluguAsianet News Telugu

నాన్న భయపడ్డాడు... 23 ఏళ్లకే పెళ్ళి చేశారు, కస్తూరి శంకర్ కామెంట్స్ వైరల్.

హీరోయిన్ గా వెండితెరపై హిట్ సినిమాలు చూసిన కస్తూరి.. ఆతువాత బుల్లితెరకు షిప్ట్ అయ్యింది. గృహలక్ష్మిగా అలరించిన కస్తూరి.. రీసెంట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..? 

Gruhalakshmi Fame Kasthuri Shankar Comments Viral JMS
Author
First Published Nov 15, 2023, 5:55 PM IST

ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా..  హీరోయిన్ గా నటి కస్తూరి శంకర్ మంచి పేరు తెచ్చుకుంది. అన్నమయ్య లాంటి సినిమాల్లో ఆమె నటన మెప్పించింది. అయితే ఈమె చాలా తక్కువ సినిమాలలో హీరోయిన్ గా నటించి.. చాలా చిన్నవయస్సులోనే పెళ్ళి చేసుకుంది. ఆతరువాత  ఇండస్ట్రీకి దూరమయ్యింది. 

అయితే సినిమాలకు దూరం అయిన కస్తూరి.. ఫారెన్ లో సెటిల్ అయ్యి.. రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది.  ఇలా చాలా సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి కస్తూరి శంకర్ తిరిగి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈమె ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తులసి పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఒకవైపు  సీరియల్స్ చేస్తూ.. అటు వెబ్ సిరీస్ లలోకూడా సందడిచేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా ఉన్న  కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. 

ఈమె తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి కూడా తన అభిప్రాయాలను తెలియజేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు. ఇలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి షాకింగ్ విషయాలు వెల్లడించింది. తన పెళ్లి ఎలా జరిగింది అనేది వివరించింది బ్యూటీ. తనపై జరుగుతున్న ప్రచారానికి భయపడి తన తండ్రి  23 సంవత్సరాలకి పెళ్లి చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కస్తూరి. 

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లపై కామన్ గా ట్రోలింగ్ జరుగుతుంది. రకరకాల మార్ఫింగ్ వీడియోలు వస్తుంటాయి. అప్పట్లో మాత్రం హీరోయిన్లపై రకరకాల ప్రచారాలు జరిగేవి. హీరోతో , నిర్మాతలలో కమిట్ మెంట్ అని వార్తలు రాసేవారు.చాలామంది గురించి రూమర్స్ వస్తుంటాయి.అయితే నా గురించి కూడా ఒక ప్రొడ్యూసర్ తో కమిట్ అంటూ ఒక చెత్త రూమర్ వైరల్ అయింది. ఈ రూమర్ వైరల్ కావడంతో.. మా నాన్న భయపడి  నాకు 23 సంవత్సరాలకే పెళ్లి చేశారని ఆమె వెల్లడించాచరు. 

నీకు పెళ్లి చేసే బాధ్యత మాపై ఉంది. నీ గురించి ఇలాంటి రూమర్స్ వచ్చాయి అంటే నీకు ఈ జీవితంలో పెళ్లి కాదు పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రారు అంటూ నాన్న భయపడిపోయారు.. వెంటనే తనకు పెళ్లి చేసి విదేశాలకు పంపించారని కస్తూరి శంకర్ తన పెళ్లి గురించి సీక్రేట్ వివరించారు.  ఇక ప్రస్తుతం కాస్తూరి చేసిన కామెంట్స్ వైరల్  అవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios