బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు గోవింద కుమారుడు యశ్వవర్ధన్‌ ఇటీవల కారు ప్రమాదానికి గురైన విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో యశ్వవర్థన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో యశ్వ వర్థణ్‌తో పాటు ఆయన డ్రైవర్‌ కూడా కారులో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ నెల 2 తేదిన ఓ పార్టీలో పాల్గోని తిరిగి వస్తున్న గోవింద తనయుడి కారును యష్ రాజ్‌ ఫిలింస్‌కు చెందిన కారు ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దీంతో ఇరు పక్షాలు కేసు పెట్టేందుకు నిరాకరించాయని ముంబై పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే చర్చించుకున్న ఇరు పక్షాలు సెటిల్‌ చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.

ఒకప్పుడు బాలీవుడ్‌ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన గోవింద, సునీతా అహుజాల తనయుడు యశ్వవర్ధన్‌. వీరికి యశ్వవర్ధన్‌తో పాటు టీనా అనే కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం గోవింద క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నాడు. చివరగా 2018లో రిలీజ్ అయిన ఫ్రైడే, రంగీలా రాజా సినిమాల్లో నటించాడు గోవిందా.