Asianet News TeluguAsianet News Telugu

'విజయ్ మాల్యా బయోపిక్' :సెన్సార్ ట్విస్ట్,ఇదేమన్నా కుట్రా?

బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగేసి.. బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో రంగీలారాజా పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

Govinda is facing difficulties to release Rangeela Raja
Author
Hyderabad, First Published Nov 12, 2018, 9:33 AM IST

బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగేసి.. బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో రంగీలారాజా పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ  బయోపిక్ లో మాల్యాగా ప్రముఖ బాలీవుడ్ హీరో గోవిందా కనిపిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు క్రేజ్ వచ్చింది. ట్రైలర్, టీజర్ కు బాగా క్లిక్ అయ్యాయి. గోవిందా కూడా తన రీలాంచింగ్ చిత్రంగా దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు.  

అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు వచ్చి పడ్డాయి. ఇరవై కట్స్ దాకా చెప్పారు.  నిజానికి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ రిలీజ్ అయ్యే నవంబర్ 8నే రంగీలా రాజా కూడా రిలీజ్ కావాల్సి ఉన్నా.. సెన్సార్ బోర్డు కట్స్ చెప్పడంతో అది కాస్తా వాయిదా పడింది. దీనిపై గోవిందా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. 

దాంతో అసలు కట్స్ చెప్పేటంత విషయం సినిమాలో ఏముంది..ప్రభుత్వాన్ని ఏమన్నా విమర్శించారా..బ్యాంకింగ్ వ్యవస్దపై సెటైర్స్ వేసారా అనేది చర్చగా మారింది. దానికి తోడు విజయమాల్యా బయోపిక్ అంటే చాలా మంది సెలబ్రెటీలకి సంభందించిన విషయాలు అందులో ఉంటాయి. వాటిల్లో ఏదన్నా టచ్ చేసారా అనే సందేహాలు కలుగుతున్నాయి.  మరో ప్రక్క కొందరు విజయ్ మాల్యాకు చెందిన వారే ..దీన్ని ఆపుతున్నారనే టాక్ సైతం సోషల్ మీడియా లో ఉంది. 

ఈ మూవీని ఈ సినిమాను సీబీఎఫ్‌సీ మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ నిర్మించాడు. ఈ మూవీ ఈ నెల 8వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రావ‌ల్సి ఉంది.. అయితే సెన్సార్ చిక్కుల్లో ప‌డ‌టంతో రిలీజ్ వాయిదా ప‌డింది.. సెన్సార్ పూర్తి కాక‌పోవ‌డంపై హీరో గోవింద సెన్సార్ బోర్డు పైనా, సినీ ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రిపైనా ఫైర్ అయ్యాడు.

సినిమా ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులు తన సినిమాలు రిలీజ్ కాకుండా కుట్ర పన్నుతున్నారని విమర్శించాడు. తన కొత్త మూవీ రంగీలా రాజాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వకుండా 20 కట్స్ చెప్పడంపై గోవిందా ఆగ్రహం వ్యక్తంచేశాడు. 

9 ఏళ్లుగా ఇలాగే జరుగుతున్నదని, ఇండస్ట్రీలో కొందరు తన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకుంటున్నారని గోవిందా ఆరోపించాడు. గత వారమే ఈయన సినిమాలో కట్స్‌ను వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడుఇన్నాళ్లుగా తన సినిమాలకు అడ్డు పడుతున్నా సైలెంట్‌గా ఉన్నానని, ఇక ఏమాత్రం మౌనంగా ఉండదలచుకోలేదని గోవిందా స్పష్టం చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios