తమిళంలో నందగోపాల్ నిర్మాణంలో .. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో  '96' సినిమా రూపొందింది. త్రిష .. విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను అక్టోబర్ 4వ తేదీన  విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. 1996లో జరిగిన ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

ఈ మధ్యన  చెన్నై వెళ్లి స్పెషల్ స్క్రీనింగ్ లో ఈ సినిమాను చూసిన దిల్ రాజు, తెలుగు రీమేక్ రైట్స్ ను కోటి రూపాయలకు దక్కించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ వార్త నిజమేనంటూ తాజాగా దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. దాంతో  '96' సినిమాను తెలుగులో రీమేక్ చేయటానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్న దిల్ రాజు, తమిళ మూవీ చేసిన ప్రేమ్ కుమార్ కే తెలుగు వెర్షన్ బాధ్యతలను అప్పగించారు. 

ఓ ప్రక్కన తెలుగు నేటివిటికి తగ్గట్లుగా ప్రేమ్ కుమార్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ తెలుగు రీమేక్ లో నటించేది ఎవరు అనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా మారింది. అల్లు అర్జున్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకువద్దామని దిల్ రాజు చాలా ప్రయత్నం చేసారట. మొదట ఓకే అనుకున్నా..తర్వాత బన్ని వెనకడుగు వేసారట. దాంతో  చాలా మంది హీరోలను అనుకుని ఫైనల్ గా గోపిచంద్ దగ్గర ఆగారట. కానీ గోపించంద్ రాంగ్ ఛాయిస్ అంటూ మీడియాలో వార్తలు గుప్పు మంటున్నాయి. దాంతో గోపీచంద్ కు కాస్తంత ఇబ్బందిగానే ఉందిట. 

గోపీచంద్ ని ఆ పాత్రలో అసలు ఊహించుకోలేమని, అతను యాక్షన్ హీరో అని, ఫ్యామిలీ సినిమాలు ట్రై చేసినప్పుడులా అవి బోల్తా పడుతూనే ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు విజయ్ సేతుపతి మంచి నటుడు కావటంతో ..ఆ పాత్రని నిజ జీవితంలో క్యారక్టర్ లా అనిపించగలిగాడు అని.. వార్తలు వస్తూండటంతో దిల్ రాజు ని సైతం ఆ వార్తలు ఇన్ఫూనియన్స్ చేస్తాయని ,గోపీచంద్ చిరాకు పడుతున్నారట.

ఏదైమైనా గోపీచంద్ ఫెరఫెక్ట్ ఛాయిస్ ..అవునా కాదా అనేది ప్రక్కన పెడితే...నువ్వు పనికిరావు అని మొహం మీద చెప్పినట్లు మీడియా వ్యవహరించటం మాత్రం పద్దతి కాదేమో అంటున్నారు టాలీవుడ్ జనం.  ఎందుకంటే చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్  ఓ  హిట్ రీమేక్ లో చేయాలనుకోవటంలో తప్పేముంది.

ఇక దిల్ రాజు త్వరలో ఈ చిత్రం రీమేక్ కు సంభందించి నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఫైనల్ గా త్రిష .. విజయ్ సేతుపతి పాత్రలను తెలుగులో చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.