టాలీవుడ్ లో మాస హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ గత కొంత కాలంగా సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్నాడు. మంచి బాక్స్ ఆఫీస్ హిట్టందుకునే స్టామినా ఉన్నప్పటికీ ఈ హీరోకు తగ్గ స్క్రిప్ట్ లు తగలడం లేదు. లౌక్యం - జిల్ తరువాత ఈ హీరో మరో యావరేజ్ హిట్ కూడా అందుకోలేకపోయాడు. 

ఇక ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మంచి యాక్షన్ సినిమాతో రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో కొన్ని నెలల క్రితం ఒక యాక్షన్ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే షెడ్యూల్ మధ్యలో గోపి గాయం కారణంగా ఆ మధ్య షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. వెంటనే రికవర్ అయ్యి సినిమాను మొదలుపెట్టిన గోపి ఇప్పుడు మళ్ళీ యాక్షన్ పార్ట్ ని ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. 

ఈ నెల 6జన హైదరాబద్ లో మొదలయ్యే షెడ్యూల్ ఎక్కువగా మాస్ ఆడియెన్స్ కొరుకునే యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విలన్స్ ని దెబ్బ కొట్టేందుకు గోపి వేసే ప్లాన్స్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటాయని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు సెల్వ రాఘవన్ శిష్యుడు బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపి మరో హిస్టారికల్ మూవీని చేస్తున్నాడు.