గోపీచంద్‌, తమన్నా జంటగా నటించిన చిత్రం `సీటీమార్‌`. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. సెప్టెంబర్‌ ఫస్ట్ వీక్‌లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. 

గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం `సీటీమార్‌`. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. సంపత్‌ నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది యూనిట్‌. థియేటర్‌లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్‌ 3న విడుదల చేయాలని నిర్ణయించినట్టు చిత్ర యూనిట్‌ తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సినిమా సెకండ్‌ వేవ్‌ కరోనాకి ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా స్టార్ట్ కావడం, కొంత షూటింగ్‌ పార్ట్ పెండింగ్‌లో ఉండటంతో వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ థియేటర్లు ఓపెన్‌ అయి, జనాలు థియేటర్‌కి వస్తోన్న నేపథ్యంలో ఎట్టకేలకు థియేటర్‌లోనే సినిమాని విడుదల చేయాలని నిర్ణయించారు. వచ్చే వారం రిలీజ్‌కి ప్లాన్‌ చేశారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో భూమికా చావ్లా కీలక పాత్ర పోషిస్తుంది. 

Scroll to load tweet…

మహిళా కబడ్డీ నేపథ్యంలో సినిమా సాగుతుంది. తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్‌ కోచ్‌గా తమన్నా, ఆంధ్రా మహిళా కబడ్డీ టీమ్‌ కోచ్‌గా గోపీచంద్‌ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ఆడియెన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి.