బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన 'ఏక్ థా టైగర్' చిత్రం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన 'ఏక్ థా టైగర్' చిత్రం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టైగర్ జిందా హై సైతం మంచి విజయం సాధించింది. అయితే హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసేయాలని మనవాళ్లు ఉత్సాహపడుతూంటారు. 

ఆ విధంగానే అప్పట్లో అంటే 'ఏక్ థా టైగర్' రిలీజైన కొత్తలో .. ప్రభాస్ ఈ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటిదాకా ప్రభాస్ ఆ సినిమా గురించి మాట కూడా ఎత్తలేదు. సరే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారని చెప్తున్నారు. అంతేకాదు ఆల్రెడీ ఈ సినిమా ప్రారంభమైపోయిందిట.

ఇంతకీ ఏ సినిమా అంటారా..? గోపీచంద్, తమిళ ద‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్‌లో ‘చాణక్య’టైటిల్ తో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మెహ్రీన్, జ‌రీన్ ఖాన్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవ‌ల రాజస్థాన్‌లో తొలి దశ షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. జూన్ 6 నుంచి ప్రారంభమైన ఈ షెడ్యూల్‌లో గోపీచంద్‌పై కొన్ని ఫైట్ సీన్స్ ను చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో గోపీచంద్ ఓ రా ఏజెంట్ గా దర్శనమివ్వనున్నాడ‌ట‌. అలాగే ‘ఏక్ థా టైగర్’కు రీమేక్‌గా వస్తున్న చిత్రమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రీమేక్ వార్తలకు సంబంధించి కూడా త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుందని మీడియా వర్గాలు ఎదురు చూస్తున్నారు.