తక్కువ రేట్లకే `పక్కా కమర్షియల్‌` సినిమాని ప్రదర్శించబోతున్నట్టు నిర్మాత బన్నీవారు తెలిపారు. ఆడియెన్స్ కి టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

సాధారణ రేట్ల కంటే తక్కువ రేట్లకే `పక్కా కమర్షియల్‌`(Pakka Commercial) సినిమాని ప్రదర్శించబోతున్నట్టు నిర్మాత బన్నీవాసు(Bunny Vasu) తెలిపారు. ఆడియెన్స్ కి టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌ 2`, `సర్కారు వారి పాట` వంటి పలు సినిమాలకు భారీగా టికెట్‌రేట్లు పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఆడియెన్స్ కి తీవ్రమైన భారం పడింది. కొన్ని సినిమాలని పెరిగిన టికెట్‌ రేట్ల కారణంగానే తక్కువ కలెక్షన్లు వచ్చాయనే కామెంట్లు వినిపించిన నేపథ్యంలో రూట్‌ మార్చారు మెగా ప్రొడ్యూసర్‌.తమ సినిమాకి టికెట్‌ రేట్లు తగ్గించారు. 

గోపీచంద్‌(Gopichand) హీరోగా, రాశీఖన్నా(Raashi Khanna) కథానాయికగా నటించిన `పక్కా కమర్షియల్‌` చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్ తో కలిసి జీఏ 2 పతాకంపై `పక్కా కమర్షియల్‌ చిత్రాన్ని వంశీతో కలిసి బన్నీవాసు నిర్మించారు. మారుతి దర్శకత్వం వహించారు. జులై 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ చిత్ర ప్రమోషనల్‌ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత అల్లు అరవింద్‌, హీరో గోపీచంద్‌, రాశీఖన్నా, బన్నీవాసు, దర్శకుడు మారుతి, బాబు, సత్య, ఎస్‌కేఎన్‌ వంటి చిత్ర బృందం పాల్గొంది. 

ఇందులో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, తమ సినిమాకి టికెట్‌ రేట్లు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. ఆడియెన్స్ కి సినిమా టికెట్‌ రేట్స్ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు, తాను మొదటి వ్యక్తులమని, నైజంలో 160+gst, ఆంధ్ర మల్టిఫ్లెక్స్ లో 150+gst, సింగిల్ స్క్రీన్ లో 100+gstతోనే తమ సినిమాని ప్రదర్శించబోతున్నట్టు చెప్పారు. అందరు టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు` అని చెప్పుకొచ్చారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ, ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మొదటి కారణం యు.వి క్రియేషన్స్ వంశీ. నా నుంచి ఎటువంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో వాటితో పాటు అన్ని మిక్స్ చేసి తీసిన కమర్షియల్ సినిమాలా ఉంటుందని హామీ ఇచ్చారు. అల్లు అరవింద్‌ చెబుతూ, `పక్కా కమర్షియల్` సినిమా ఓటిటిలో అంత త్వరగా రాదు, `f3` సినిమా ప్రస్తుతం బాగా ఆడుతుంది, దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా కూడా ఉండబోతుందని మెగా నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. సినిమా ప్రమోట్‌ చేసుకోవాల్సిన బాధ్యత హీరోహీరోయిన్లపై ఉందన్నారు. 

గోపిచంద్ మాట్లాడుతూ, నేను ఈ సినిమా చెయ్యడానికి కారణం వంశీ, జిల్ తరువాత ఎప్పటినుంచో సినిమా చెయ్యాలనుకున్నాం కానీ మంచి కథ దొరకలేదు. కథ బాగా నచ్చడంతో, చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాం. మారుతి తో షూటింగ్ స్టార్ట్ అవ్వగానే మాకు వేవ్ లెన్త్ బాగా కుదిరింది. ఒక పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ పక్కా కమర్షియల్` అని వెల్లడించారు.