ప్రతి రోజు పండగే సినిమాతో మంచి హిట్ అందుకుని తన సత్తా చాటుకున్న దర్శకుడు మారుతి దాసరి. వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించాలని మారుతి ప్రయత్నం చేసారు. కానీ కరోనా రావడంతో అతడి సినిమా ఒక ఏడాది పాటు వెనక్కి వెళ్లింది. ప్రస్తుతం పరిస్దితులు అనుకూలించటంతో గోపీచంద్‌ను కలిసాడు మారుతి. కథ నచ్చడంతో గోపీ చంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.  ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనపించనున్నాడు. ఈ సినిమా జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. 

అయితే.. తాజాగా ఇవాళ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ త్వరలోనే రాబోతోందని మారుతి వెల్లడించారు. కాగా...ప్రస్తుతం గోపీచంద్ తన నూతన సినిమా సీటీమార్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా విడుదలైన తరువాత మారుతి సినిమాలో జాయిన్‌ కానున్నాడు. అలాగే ఈ విషయాన్ని వెల్లడిస్తూ మారుతి తన ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్‌ చేశారు. వినూత్న తరహాలో కొత్త సినిమా ప్రకటనతో ఉన్న ఆ వీడియోను మీరు చూసేయండీ! 

https://www.youtube.com/watch?v=h-IvsdILkqs&feature=emb_title&ab_channel=UVCreations

దీనిలో అటు విజయవాడ, ఇటు హైదరాబాద్‌ ప్రాంతాల ల్యాండ్‌స్కేప్‌ చూపిస్తూ.. తనపై న్యూస్‌ఛానెళ్లు బ్రేకింగ్‌న్యూస్‌ చదువుతున్నట్టు చూపించారు.  అక్కడ సీన్ కట్‌ చేస్తే.. కోర్టులో న్యాయమూర్తిగా  రావురమేష్ తీర్పునిస్తూ ‘‘సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట ముద్దాయి డైరెక్టర్‌ మారుతి ప్రతిరోజూ పండగ సినిమా తర్వాత తీయబోయేది ఈ కథే..’’అంటూ సాగే తీర్పులో గోపిచంద్‌ హీరోగా కొత్త సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి అల్లు అరవింద్‌, బన్నీవాసు, యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు తెలిపారు.