కండీషన్: బాలయ్యతో హిట్ కొడితే సూపర్ స్టార్ డేట్స్


బాలకృష్ణతో మీ నెక్ట్స్ సినిమా కాబట్టి ఆయనతో హిట్ కొట్టి రండి..ఇమ్మిడియట్ గా మా సూపర్ స్టార్ తో సినిమా చేద్దురు కానీ అని ఓ డైరక్టర్ కు ఓ పెద్ద బ్యానర్ వాళ్లు బంపర్ ఆఫర్ ఇచ్చారని మీడియాలో గుసగుసలు. ఇంతకీ ఎవరా డైరక్టర్...ఆ బ్యానర్ ఏది..అయినా ఇలాంటి లింక్ పెట్టారు ఏంటి అంటే..దాని వెనక ఓ కథ ఉంది.

Gopichand malinieni Gets Bumper Offer From Mythri? jsp


బాలకృష్ణతో మీ నెక్ట్స్ సినిమా కాబట్టి ఆయనతో హిట్ కొట్టి రండి..ఇమ్మిడియట్ గా మా సూపర్ స్టార్ తో సినిమా చేద్దురు కానీ అని ఓ డైరక్టర్ కు ఓ పెద్ద బ్యానర్ వాళ్లు బంపర్ ఆఫర్ ఇచ్చారని మీడియాలో గుసగుసలు. ఇంతకీ ఎవరా డైరక్టర్...ఆ బ్యానర్ ఏది..అయినా ఇలాంటి లింక్ పెట్టారు ఏంటి అంటే..దాని వెనక ఓ కథ ఉంది.

డైరక్టర్ గోపిచంద్ మలినేని ..క్రాక్ సినిమా తో పెద్ద హిట్ కొట్టారు. వరస ప్లాఫ్ ల్లో ఉన్న గోపీచంద్ మలినేనికి ఆ సినిమా లేపి నిలబెట్టింది. తెలుగు హ్యాపినింగ్ డైరక్టర్స్ లో ఒకరిగా చేసింది. అయితే ఈ డైరక్టర్ నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అని అందురూ ఎదురుచూస్తున్న టైమ్ లో బాలయ్యతో మైత్రీ మూవీస్ బ్యానర్ లో సినిమా ఆఫర్ వచ్చింది. వెంటనే కమిటయ్యారని సమాచారం. 
 
ఆగస్ట్ నుంచి ఈ సినిమా షూటింగ్ ఉండవచ్చు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. అయితే ఈ లోగా మైత్రీ మూవీస్ వారు ఓ బ్రహ్మాండమైన ఆఫర్ గోపిచంద్ మలినేనికు ఇచ్చారని సమాచారం. అదేమిటంటే..బాలయ్య సినిమాని హిట్ కొట్టు..వెంటనే నీ చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబుని పెడతామని చెప్పారట. మహేష్ తో కనుక సినిమా చేస్తే ఖచ్చితంగా టాలీవుడ్ నెంబర్ వన్ దర్శకులలో ఒకరు అయ్యిపోతారు గోపిచంద్ మలినేని. దాంతో ఇప్పుడు రెట్టింపు కృషితో ఎట్టి పరిస్దితుల్లోనూ బాలయ్య తో సినిమా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారట. 

మైత్రీమూవీస్ గతంలో మహేష్ బాబుతో శ్రీమంతుడు అనే చిత్రం తీసి హిట్ కొట్టారు. అలాగే సర్కారు వారి పాట సినిమాలోనూ వారికి షేర్ ఉంది. వాళ్లు సింగిల్ గా మళ్లీ మహేష్ తో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో మంచి డైరక్టర్ తో మహేష్ ని లాక్ చేద్దామని చూస్తున్నారు. అయితే మహేష్ ఈ లోగా అనీల్ రావిపూడితో ఓ సినిమా ఫినిష్ చేసి రాజమౌళి తో సినిమా చెయ్యటానికి రెడీ అవుతున్నారు. మరి గోపిచంద్ మలినేనితో మహేష్ సినిమా అంటే కాస్త ఎక్కువ టైమే పడుతుందేమో.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios