Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ చెయ్యాల్సింది...లాస్ట్ మినిట్ లో రవితేజ సీన్ లోకి...పెద్ద హిట్

గోపిచంద్ మలినేని బాలయ్యతో చేసిన సంక్రాంతి చిత్రం `వీర‌సింహారెడ్డి` హిట్ అవ్వ‌డంతో…మీడియాతో మాట్లాడుతూ అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు.

Gopichand malineni reveals intresting fact about Don seenu movie
Author
First Published Jan 23, 2023, 10:42 AM IST


రవితేజ, శ్రియ హీరో, హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకుడిగా పరిచయం అయిన సినిమా ‘డాన్ శీను’.  శ్రీహరి, కస్తూరి, అంజనా సుఖాని ముఖ్యపాత్రల్లో నటించిన  ఈ సినిమా విడుదలైన 2010 లో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.ఈ సినిమాను ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్‌లో వెంకట్ నిర్మించారు. సురేష్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. కే. అచ్చిరెడ్డి సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు.  ఈ సినిమా ప్రస్దావన ఇప్పుడెందుకు వచ్చిందంటే...గోపిచంద్ మలినేని బాలయ్యతో చేసిన సంక్రాంతి చిత్రం `వీర‌సింహారెడ్డి` హిట్ అవ్వ‌డంతో…మీడియాతో మాట్లాడుతూ అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు. 

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ... నిజానికి ఈ క‌థ‌.. ముందు ప్ర‌భాస్ విన్నాడు. న‌చ్చింది కూడా. `క‌థ రెడీ చేయ్‌.. చేసేద్దాం` అని మాట ఇచ్చాడు. కానీ ఆ వెంట‌నే `ఏక్ నిరంజ‌న్` మొద‌లైపోయింది. ప్ర‌భాస్ కాల్షీట్లు దొర‌క‌డానికి ఇంకొన్నాళ్లు ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి. అందుకే… ర‌వితేజ‌కు వినిపించి, ఓకే చేయించేసుకొన్నా అని చెప్పుకొచ్చారు గోపీచంద్‌. మ‌ధ్య‌లో హీరో గోపీచంద్ కూడా ఈ సినిమా చేద్దామ‌ని అనుకున్నాడు. కానీ చివ‌రికి ర‌వితేజ చేతుల్లోకి వెళ్ళి సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. అయితే ప్రభాస్ నో చెప్పటానికి కారణం... ‘డాన్ శీను’ మూవీ కథ ప్రభాస్ చేసిన ‘బుజ్జిగాడు’ కథకి దగ్గరగా ఉండడంతో అతను నొ చెప్పాడని అంటారు.

ప్రభాస్ నొ చెప్పడంతో గోపిచంద్ కు కూడా ఈ కథని వినిపించినప్పుడు... దిల్ రాజు ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చాడు. కానీ గోపీచంద్ అప్పటికి ‘గోలీమార్’ ‘వాంటెడ్’ వంటి సినిమాలకి కమిట్ అవ్వడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు.ఇక ఆ ఇద్దరు హీరోలు నొ చెప్పడంతో దిల్ రాజు ఈ కథని హోల్డ్ లో పెట్టారట. ఎక్కువ రోజులు వెయిట్ చేయడం ఇష్టం లేని గోపీచంద్ ‘ఆర్.ఆర్ మూవీ మేకర్స్’ వారికి ఈ కథని చెప్పి ఓకే చేయించుకున్నారు. వాళ్ళ దగ్గర రవితేజ బల్క్ కాల్షీట్లు ఉండడంతో ఈ ప్రాజెక్టు  సెట్స్ పైకి వెళ్లిపోవడం.. 77 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలవ్వడం,సూపర్ హిట్ అవ్వటం జరిగిపోయాయి.

ఈ చిత్రం అప్పటికి ‘ఆంజనేయులు’ ‘శంభో శివ శంభో’ వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజకి స్ట్రాంగ్ కంబ్యాక్ ను ఇచ్చింది. తర్వాత రవితేజ,గోపీచంద్ కాంబినేషన్లో ‘బలుపు’ ‘క్రాక్’ వంటి సినిమాలు ఇచ్చాయి.   ప్రస్తుతం  గోపీచంద్ ద‌గ్గ‌ర రెండు క‌థ‌లు రెడీగా ఉన్నాయి. ఒక‌టి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి టేట‌ర్ మేడ్ క‌థ‌. ఇంకొక‌టి.. థ్రిల్ల‌ర్‌ అని తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios