టాలీవుడ్ లో ఇప్పుడు డేంజరస్ రెడ్ జోన్ ;లో ఉన్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. మనోడు హిట్టందుకొని చాలా కాలమవుతోంది. లౌక్యం తరువాత ఎన్ని సినిమాలు చేసినా ఒక్క బాక్స్ ఆఫీస్ హిట్ కూడా అందుకోలేదు. ఇప్పుడు మాత్రం ఎలాగైనా మళ్ళి తన ఫ్యాన్స్ ను మెప్పించాలని గోపీచంద్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. 

ప్రస్తుతం గోపి తీరు దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ బార్డర్ నేపథ్యంలో వస్తోన్న ఈ కథపై గోపి చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అయితే సినిమా షూటింగ్ లో ఇటీవల ఒక యాక్షన్ సీన్ ని షూట్ చేస్తుండగా గోపికి తీవ్ర గాయాలు అయినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే చిన్న దెబ్బె అని గోపి కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్ అని డాక్టర్స్ సలహాలు ఇచ్చారట. 

అయితే గాయం కోలుకోవడానికి తుది దశలో ఉండగా ఆగిపోయిన షెడ్యూల్ ని కంటిన్యూ చేసి వీలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఇంకా మూడు రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ గోపి ఒక్క క్షణం కూడా వెస్ట్ చేయకూడదని చిత్ర యూనిట్ తో షూటింగ్ ను మొదలెట్టాలని చెప్పేశాడు. హిట్టుకొట్టాలనే కసితో ఉన్న గోపి ఈ పట్టుదలతో ఎంతవరకు సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.