యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో గోపీచంద్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తెచ్చాడు. ప్రస్తుతం గోపి చాణక్య సినిమాతో బిజీగా  సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కోలీవుడ్ కి చెందిన కొత్త దర్శకుడు బిను సుబ్రహ్మణ్యంతో మరో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. అసలైతే కొన్ని నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్ సెట్టయ్యింది. 

కానీ గోపీచంద్ చాణక్య షూటింగ్ తో బిజీగా ఉండడంతో  ఈ ప్రాజెక్ట్ ఆలస్యంగా పట్టాలెక్కింది. ఫైనల్ గా సినిమా రెగ్యులర్ షూటింగ్ ని నేడు స్టార్ట్ చేశారు. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో గోపి సాహసం సినిమాను కూడా ఈయనే నిర్మించారు. ఇక ఇప్పుడు సరికొత్తగా ఫాంటసీ అడ్వెంచర్ గా ఈ కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. 

ఇక గోపీచంద్ నుంచి త్వరలో రాబోతున్న చాణక్య సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ టీజర్ ఇప్పటికే ఆడియెన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసింది. సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.