గోపీచంద్ మూవీని ఫారెన్ షెడ్యూల్ తో స్టార్ట్ చేసిన శ్రీను వైట్ల, వైరల్ అవుతున్న వీడియో
వరుస ఫెయిల్యూర్స్ తో.. ఇక అయిపోయాడు అనుకున్న దర్శకుడు.. జోష్ తో పైకి లేచి వచ్చాడు. ఒకప్పుడు సూపర్ హిట్లు ఇచ్చి.. ఆతరువాత ప్లాప్ సినిమాల దర్శకుడిగా మారిపోయిన శ్రీను వైట్ల.. తాజాగా గోపీచంద్ తో సినిమా స్టార్ట్ చేశాడు.

వరుస ఫెయిల్యూర్స్ తో.. ఇక అయిపోయాడు అనుకున్న దర్శకుడు.. జోష్ తో పైకి లేచి వచ్చాడు. ఒకప్పుడు సూపర్ హిట్లు ఇచ్చి.. ఆతరువాత ప్లాప్ సినిమాల దర్శకుడిగా మారిపోయిన శ్రీను వైట్ల.. తాజాగా గోపీచంద్ తో సినిమా స్టార్ట్ చేశాడు.
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాడు టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల. ఆతరువాత కొంత కాలానికి ప్లాప్ లకు మాత్రమేపరిమితం అయ్యాడు దర్శకుడు. అంతే కాదు స్టార్లు.. సూపర్ స్టార్లు ఎంత మందిని సెలక్ట్ చేసుకుని సినిమాలు చేసినా.. లక్ మారలేదు వైట్లకు. ఇక ఈమధ్య చాలా గ్యాప్ తీసుకున్న శ్రీను వైట్ల తాజాగా తన సినిమాను స్టార్ట్ చేశాడు. గతంలోనే మాచో స్టార్ గోపీచంద్ తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. ఇటీవలే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఆ తరువాత వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసి శరవేగంగా ముందుకు తీసుకువెళ్లారు.
ఇక ఈక్రమంలోనే శ్రీనువైట్ల మొన్న లొకేషన్స్ కోసం ఇటలీ వెళ్లి అక్కడ కొన్ని ప్లేస్ లు ఫైనల్ చేశాడు. తాజాగా ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ ని ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ ని మొదలుపెట్టినట్లు ఒక వీడియో ద్వారా తెలియజేశాడు. ఇక ఇటలీలోని మిలన్ లో మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేసినట్లు శ్రీనువైట్ల వీడియో ద్వారా తెలియజేశాడు. మూవీలోని కొన్ని కీ సీన్స్ ని అక్కడ షూట్ చేయబోతున్నాడు. అయితే ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకుని సినిమా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ మూవీలో గోపీచంద్ జతగా ఎవరు నటించబోతున్నారు అన్నది మాత్రం క్లారిటీ లేదు.. దానిపై మూవీ టీమ్ కూడా ఇప్పటి వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. చిత్రాలయం స్టూడియోస్ పతాకం పై మొదటి ప్రొడక్షన్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి విశ్వం అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మూవీ టీం నుంచి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.