రామ బాణం ను.. ఈ సినిమాకు టైటిల్ గా పెట్టారట.  త్వరలోనే టైటిల్ ఎనౌన్సమెంట్ కానుంది. 


గత కొంతకాలంగా గోపీచంద్ కు హిట్ అనేది లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ గా సక్సెస్ అయి మళ్లీ హీరోగా చేసి నిలదొక్కుకున్నాడు గోపీచంద్. అయితే కథల ఎంపికలో తేడా తో ఆయన సినిమాలు ఏ వర్గాన్ని అలరించటం లేదు. రీసెంట్ గా విడుదలైన గోపీచంద్ సినిమా ‘పక్కా కమర్షియల్’ కూడా నిరాశపరచటంతో ఇప్పుడు ఈ హీరో ఆశలన్నీ రాబోయే శ్రీవాస్ సినిమాపైనే ఉన్నాయి. 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత ఆ స్థాయి హిట్ మళ్ళీ గోపీకి దక్కలేదు. మధ్యలో ‘జిల్, సీటీమార్’ వంటి యావరేజ్ సినిమాలు ఉన్నా మిగిలినవి అన్నీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చినవే.

 హింది యూట్యూబ్ డబ్బింగ్ రైట్స్ లేకుంటే గోపీచంద్ ని పలకరించే వారు కూడా ఉండరని ట్రేడ్ అంటోంది. కథల ఎంపికలో గోపీచంద్ వరుసగా తప్పటడుగులు వేస్తున్నాడని వరుసగా విడుదలైన ఆయన సినిమాలను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని తనకు రెండు హిట్లు ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ నే గోపీచంద్ నమ్ముకున్నాడు.

లక్ష్యం, లౌక్యం తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రానికి టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. రామ బాణం ను.. ఈ సినిమాకు టైటిల్ గా పెట్టారట. త్వరలోనే టైటిల్ ఎనౌన్సమెంట్ కానుంది. ఇక ఇటీవలే ప్రభాస్ తో కలిసి గోపీచంద్ అన్ స్టాపబుల్ షో లో సందడి చేయడంతో ఈ సినిమా టైటిల్ హైలైట్ గా మారింది. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ హిట్ ను హిట్ కొడతాడో లేదో చూడాలి.

మరో ప్రక్క గోపీచంద్.. తమిళ దర్శకుడు హరి తో ఓ సినిమా కమిట్ అయినట్లు వినిపిస్తోంది. హరి మాస్ మసాలా డైరెక్టర్. అప్పట్లో ఎన్టీఆర్ కి హరి ఓ కథను వినిపించాడని అయితే ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవలేదని వినికిడి. ఇప్పుడు ఆ కథనే గోపీచంద్ కి వినిపించాడట. కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట గోపీచంద్. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న శ్రీవాస్ సినిమా హిట్ అయితేనే గోపీచంద్ ఈ ప్రాజెక్టు చేస్తారని అంటున్నారు. లేకుంటే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరి గోపీని శ్రీవాస్ గట్టెక్కిస్తాడో లేదో చూడాలి.