టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రభాస్ - గోపీచంద్ మంచి స్నేహితులని అందరికి తెలిసిందే. వర్షం సినిమాతో హీరో విలన్ గా కలిసి నటించినప్పటికీ అంతకుముందే వీరు మంచి స్నేహితులు. ఇక మళ్ళీ వీరు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ మధ్యలో కలిసి నటిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. 

ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని త్వరగానే తెలిసిపోయింది. అయితే సినిమా మాత్రం తప్పకుండా ఉంటుందని ఇరు వర్గాల నుంచి ఎప్పటికప్పుడు ప్రకటనలు వచ్చాయి. ఇక అసలు విషయానికి వస్తే గోపీచంద్ ప్రభాస్ తో మల్టీస్టారర్ గురించి ఒక క్లారిటీ ఇచ్చేశాడు.  రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో మల్టీస్టారర్ ఉంటుందని అయితే అందుకు తగిన కథ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 

మంచి కాన్సెప్ట్ తో కథ ససెట్టయితే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని కూడా యాక్షన్ హీరో కూల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందా అని ఇరు వర్గాల అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సాలిడ్ హీరోలను బ్యాలెన్స్ చేసే దర్శకుడు ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకువస్తాడో చూడాలి.