Asianet News TeluguAsianet News Telugu

గూగుల్ పొరపాటు.. బాలయ్య మరణ తేదీ వివరాలు!

నిక్షేపంగా ఉన్న నందమూరి బాలకృష్ణని గూగుల్ మహాతల్లి చంపేసింది. ఆయన చనిపోయిన డేట్ ని కూడా చూపిస్తుంది. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా..? పవన్ కళ్యాణ్ పేరుని కౌశల్ బాబు అని చూపించడం, పెళ్లికాని రాశిఖన్నాకి పెళ్లైందని తన భర్త ఫోటోలని కూడా పెట్టడం గూగుల్ కే చెల్లింది. 

google showing wrong information about nandamuri balakrishna
Author
Hyderabad, First Published Oct 8, 2018, 4:04 PM IST

నిక్షేపంగా ఉన్న నందమూరి బాలకృష్ణని గూగుల్ మహాతల్లి చంపేసింది. ఆయన చనిపోయిన డేట్ ని కూడా చూపిస్తుంది. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా..? పవన్ కళ్యాణ్ పేరుని కౌశల్ బాబు అని చూపించడం, పెళ్లికాని రాశిఖన్నాకి పెళ్లైందని తన భర్త ఫోటోలని కూడా పెట్టడం గూగుల్ కే చెల్లింది.

కొన్ని పొరపాట్ల కారణంగా అప్పుడప్పుడు గూగుల్ తప్పుడు సమాచారాన్ని అందిస్తుంటుంది. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ పేరుని సెర్చ్ లో కొట్టినప్పుడు ఆయన  చనిపోయినట్లుగా చూపిస్తుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. గూగుల్ లో మనం దేనికోసమైనా.. వెతికినప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఏఏ సైట్స్ లో ఉందో గమనించి ఆ వివరాలను గూగుల్ మనకి చూపిస్తుంది. ఒకే పదంతో వెతికితే ఆ పదానికి సంబంధించిన సమాచారాన్ని వెతికి ఇస్తుంది. అదే మనం రెండు పదాలతో వెతికితే ఆ రెండు పదాలు కలిసి ఉన్న 
సమాచారంతో పాటు విడివిడిగా ఉన్న సమాచారాన్ని కూడా ఇస్తుంది.

 ఇక్కడే గూగుల్ పప్పులో కాలేసింది. ఇక్కడ నందమూరి బాలకృష్ణ సమాచారం కోసం వెతికితే కన్నడ సినిమా రంగంలో టి.ఎన్.బాలకృష్ణ అని మరో సీనియర్ నటులు ఉన్నారు. దీంతో ఆయన వివరాలను బాలకృష్ణకి జోడించి చూపిస్తున్నారు. ఇప్పటికైనా గూగుల్ ఈ పొరపాటుని గ్రహించి సరిదిద్దుకుంటుందేమో చూడాలి!

google showing wrong information about nandamuri balakrishna

Follow Us:
Download App:
  • android
  • ios