Asianet News TeluguAsianet News Telugu

సీనియర్ హీరో నాగార్జునకు నోటీసులు, చర్యలు తీసుకుంటామంటూ పంచాయితీ నుంచి హెచ్చరిక

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జునకు నోటీసులు జారీ అయ్యాయి. అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ.. కింగ్ పై ఆరోపణలు చేస్తూ నోటీస్ ఇష్యూ చేశారు. అయితే నోటీస్ లు వచ్చింది మన తెలుగు రాష్ట్రాల నుంచి కాదు.  

Goa Mandrem panchayat issues stop work notice to Telugu Hero Nagarjuna
Author
First Published Dec 21, 2022, 7:33 PM IST

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జునకు నోటీసులు జారీ అయ్యాయి. అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ.. కింగ్ పై ఆరోపణలు చేస్తూ నోటీస్ ఇష్యూ చేశారు. అయితే నోటీస్ లు వచ్చింది మన తెలుగు రాష్ట్రాల నుంచి కాదు.  

అక్రమ నిర్మాణాలు ఆపాలంటూ.. టాలీవుడ్​ స్టార్​ హీరో నాగార్జునకు గోవాలోని మాండ్రేమ్ పంచాయతీ సర్పంచ్​ నోటీసులు జారీ చేశారు. గ్రామంలో నాగార్జునకు సంబంధించిన నిర్మాణ పనులను ఆపాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉత్తర గోవాలోని మాండ్రేమ్ గ్రామంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా  అక్రమంగా  నిర్మాణం మరియు తవ్వకం పనులు చేపట్టారని. వాటిని వెంటనే ఆపేయాలంటూ.. ప్రముఖ తెలుగు నటుడు నాగార్జునకు ఉత్తర గోవాలోని పంచాయతీ బుధవారం స్టాప్ వర్క్ నోటీసు జారీ చేసింది.

"మాండ్రేమ్​ పంచాయతీ సర్వే నెం.211/2బి అశ్వేవాడ, మాండ్రేమ్ ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా మీకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంటనే పనులు ఆపకపోతే పంచాయతీ రాజ్​ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని మాండ్రేమ్​ సర్పంజ్​ అమిత్​ సావంత్​.. నాగార్జునకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. గోవా పంచాయతీ రాజ్ చట్టం కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. 

అయితే ఈ నోటీసుల విషయంలో కింగ్ నాగార్జున స్పందించలేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న నాగ్.. అటు వ్యాపార రంగంలోను సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. నిర్మాతగా, స్టూడియో అధినేతగానే కాకుండా.. కన్వన్షన్ సెంటర్లు, హోటల్ రంగాలలో కూడా నాగార్జున బిజినెస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గోవాలో కూడా నాగ్ వ్యాపారాన్ని విస్తరింస్తున్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios