వైరస్ సునామీలా దూసుకొస్తుంది. ప్రధాని మోడీ కూడా ఇదే విషయంపై హెచ్చరించారు. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఆవేదన చెందుతుంది. ట్విట్టర్ ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.
దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. గతేడాది కంటే ఈ సారి సెకండ్ వేవ్‌లో భాగంగా కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. రోజుకు మూడు లక్షల వరకు కొత్త కేసులు నమోదవుతుండటం అత్యంత ఆందోళన కలిగిస్తుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వైరస్ సునామీలా దూసుకొస్తుంది. ప్రధాని మోడీ కూడా ఇదే విషయంపై హెచ్చరించారు. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఆవేదన చెందుతుంది. ట్విట్టర్ ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.
`కరోనా విజృంభన ఎంత భయంకరంగా ఉందో చూస్తూనే ఉన్నాం. భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైద్య రంగం నుంచి కూడా పరిస్థితి చేయిదాటిపోయే పరిస్థితి ఉంది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు. మీ కోసం, మీ ఫ్యామిలీ కోసం, స్నేహితుల కోసం, ఫ్రంట్‌లైన్ వారియర్ల కోసం మీరంతా ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితేనే బయటకు రండి. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా మాస్కులు ధరించండి. ప్లీజ్ పరిస్థితిని అర్థం చేసుకోండి. మీ వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోండి. మనం తీసుకునే జాగ్రత్తలే వైద్య రంగంపై ఒత్తిడి తగ్గిస్తాయి` అని తెలిపింది ప్రియాంక.
బాలీవుడ్ నటిగా రాణించి హాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ పాప్ స్టార్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం `సిటాడెల్` అనే అమెజాన్ సిరీస్‌తో పాటు `మ్యాట్రిక్స్ 4`లోనూ నటిస్తోంది. హీరోయిన్‌గానూ పలు సినిమాలతో బిజీగా ఉంది.
