స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తను తల్లయ్యాక పొందిన అనుభూతిని  తెలియజేస్తూ ఫస్ట్ పోస్ట్ పెట్టింది. తన బిడ్డను గుండెకు హత్తుకున్నాక ఈ ప్రపంచాన్నే మరిచిపోయానంటూ మురిసిపోతోంది.  

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రెండురోజుల కింద మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తను ఎంతో సంతోషపడుతోంది. తన బిడ్డకు చూసుకుంటూ ఈ ప్రపంచాన్నే మరిచిపోతోంది. తను తొలిసారి అభిమానులకు బేబీ బంప్ ను చూపించినప్పటటి నుంచి ఎప్పటి కప్పుడు తన ఆరోగ్య విషయాలను తెలియజేస్తూనే ఉంది. ఎలాంటి ఆహారం తీసుకుంటుందో.. ఫిజికల్ ఫిట్ నెస్ కోసం ప్రెగ్నెన్సీ ఎక్సర్ సైజ్ లు కూడా చేసే వీడియోలనూ షేర్ చేసింది చివరిగా తన భర్త గౌతమ్ కిచ్లు డ్యూరింగ్ సమయంలో తన ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహించాడో కూడా వివరించింది. 

అయితే తాజాగా తను బిడ్డకు జన్మనిచ్చాక ఫస్ట్ పోస్ట్ చాలా భావోద్వేగంగా పెట్టింది. సుదీర్ఘమైన నోట్ రాస్తూ బిడ్డకు జన్మనివ్వడం పట్ల పొందిన అనుభూతిని తెలియజేసింది. ‘నా బిడ్డ నీల్‌ను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నీల్ పుట్టిన క్షణాల్లోనే తెల్లటి వస్త్రాని ధరింపజేసి నా ఛాతీపై పట్టుకోబెట్టారు. నీల్ నా గుండెపై పడుకున్నప్పటి స్వీయ వాస్తవికత, వర్ణించలేని అనుభూతిని పొందాను. ఒక్క క్షణం తల్లిగా పట్టలేని ఆనందాన్ని పొందాను. అలాగే లోతైన ప్రేమను పొందగలిగాను.

కానీ ఇది అంత సులభం కాదు.. మూడు నిద్రలేని రాత్రులు, తెల్లవారుజామున రక్తస్రావం, సాగిన చర్మం, ఘనీభవించిన ప్యాడ్‌లు, బ్రెస్ట్ పంపులు, అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ తెల్లవారుజామున నీల్ ను గుండెకు హత్తుకోవడంతో ఆ బాధనంత మరిచిపోయాను. ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకున్నాం. ముద్దులతో నాబిడ్డను ప్రేమను చూపించాను. ఈ అద్భుతమైన ప్రయాణం వాస్తవానికి, ప్రసవానంతరం ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు.. కానీ అది ఖచ్చితంగా అందంగా ఉంటుంది’ అని చెబుతూ.. తన ప్రెగ్నెన్సీ అప్పటి ఫొటోను కూడా పోస్ట్ చేసింది. 

తాజాగా కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లు తన కుమారుడి పేరును తెలియజేశాడు. నీల్ కిచ్లు (Neil Kichlu)గా నామకరణం చేసినట్టు తెలిపారు. తను తండ్రి అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోంది. తను నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’(Acharya) ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi),మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవికి జంటగా కాజల్ నటించింది.

View post on Instagram