Asianet News TeluguAsianet News Telugu

‘సాహో’కి జిబ్రాన్ ని ఎంచుకోవటం వెనక ఇంట్రస్టింగ్ స్టోరీ

ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్  దాదాపుగా పూర్తికావొచ్చింది. 

Gibran is composing background music for Saaho
Author
Hyderabad, First Published Jun 18, 2019, 9:43 AM IST

ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్  దాదాపుగా పూర్తికావొచ్చింది. అయితే  లాస్ట్ మినిట్ లో  మ్యూజిక్ డైరక్టర్స్ వైపు నుంచి ట్విస్ట్ పడింది. బాలీవుడ్‌ త్రయం శంకర్‌ ఎహ్‌సాన్‌ లాయ్‌లను మొదట మ్యూజిక్ కోసం  నియమించుకుంది చిత్ర యూనిట్. బాలీవుడ్ మార్కెట్ సైతం కలిసి వస్తుందని చేసిన ప్రయత్నం ఫలించలేదు.  అనివార్య కారణాల వల్ల వాళ్లు టీమ్‌ నుంచి తప్పుకున్నారు. 

అప్పటి నుంచీ ‘సాహో’ కోసం సంగీత దర్శకుడి అన్వేషణ చాలా కాలంనుంచే సాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో జిబ్రాన్‌ని తీసుకున్నారు.  అయితే జిబ్రాన్ ని సంగీత దర్శకుడుగా ఫైనలైజ్ చేయటం వెనక ఓ ఆసక్తికరమైన విషయం ప్రచారంలోకి వచ్చింది.  తమన్, జిబ్రాన్ వీళ్లద్దరిలో ఎవరో ఒకరని ఫైనల్ చేయాలని డిసైడ్ అయ్యిందిట టీమ్. వీళ్లద్దరిలో ఎవరిని ఎంచుకుంటే ప్రాజెక్టుకి  న్యాయం చేస్తారు అని ఆలోచించి..ప్రేక్షకుల పల్స్ ని బట్టి ముందుకు వెళ్దామని డిసైడ్ అయ్యారట.  

జిబ్రాన్, తమన్ ఇద్దరి చేత విడివిడిగా  తమ మేకింగ్ వీడియోలు ‘సాహో చాప్టర్‌ 1’, ‘సాహో చాప్టర్‌ 2’ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పించారు. వాటి నుంచి వచ్చిన రెస్పాన్స్, విభిన్నమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరు ఇచ్చారనేది అంచనా వేసి జిబ్రాన్ ని ఫైనలైజ్ చేసారట. అయితే ఇలా తమకు టెస్ట్ లాంటిది పెడుతున్నారనే విషయం ఆ ఇద్దరు సంగీత దర్శకులకు మొదట తెలియదట. 

చిత్ర టీమ్ ఈ విషయమై స్పందిస్తూ..‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. జిబ్రాన్‌ ఈ విషయంలో సిద్ధహస్తుడు. అందుకే జిబ్రాన్ ని  ఎంచుకున్నాము’’అని ప్రకటించింది.

‘రన్‌ రాజా రన్‌’, ‘విశ్వరూపం’, ‘జిల్‌’ లాంటి చిత్రాలకు సంగీతం అందించారు జిబ్రాన్‌. ఇప్పుడు ‘సాహో’ చిత్రానికీ ఆయనే నేపథ్య సంగీతం అందివ్వనున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌  హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో  నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఆగస్టు 15న సినిమా విడుదల కాబోతోంది. 

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios