నిన్న భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల చేశారు. రేపు ప్రీ రిలీజ్ వేడుక కూడా జరుగుతుంది. ఇక భీమ్లా నాయక్ వాయిదా జరగనిపని దీంతో గని చిత్ర నిర్మాతలు నేడు స్పష్టత ఇచ్చారు.

అనుకున్న సమయానికి సినిమా విడుదలయ్యే రోజులు పోయాయి. ఒక్కో సినిమా రెండు మూడు విడుదల తేదీలు ప్రకటించాల్సి పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా సినిమాల ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్ర పోటీ ఏర్పడింది. కాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ (Bheemla nayak)మూవీ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక టికెట్స్ ధరలు పెంపు జీవో ఆలస్యం అయ్యేలా కనిపించడంతో భీమ్లా నాయక్ ఏప్రిల్ కి షిఫ్ట్ అవుతుందని భావించిన 'గని' చిత్ర నిర్మాతలు ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 

గని (Ghani) చిత్రంతో పాటు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ కూడా ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో వంద శాతం సీటింగ్ కి అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతో భీమ్లా నాయక్ నిర్మాతలు టికెట్స్ ధరల పెరుగుదలను పట్టించుకోకుండా ఫిబ్రవరి 25నే విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే భీమ్లా నాయక్ విడుదలను చివరి వరకు నమ్మలేని భావించిన గని చిత్ర నిర్మాతలు కొత్త విడుదల తేదీ ప్రకటన చేయలేదు. 

నిన్న భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల చేశారు. రేపు ప్రీ రిలీజ్ వేడుక కూడా జరుగుతుంది. ఇక భీమ్లా నాయక్ వాయిదా జరగనిపని దీంతో గని చిత్ర నిర్మాతలు నేడు స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదల నేపథ్యంలో తమ చిత్ర విడుదల వాయిదా వేస్తున్నట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. పవన్ అభిమానులుగా భీమ్లా నాయక్ చిత్రం కోసం మేము కూడా ఎదురుచూస్తున్నాం. గని విడుదల తేదీని వెనక్కి జరపడం జరిగింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాము. గని మూవీపై మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు... అంటూ ప్రకటనలో తెలిపారు. 

Scroll to load tweet…

మార్చ్ లో గని విడుదల చేసే అవకాశం కలదు. కాగా ఈ చిత్రంలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తుండగా సిద్దు ముద్ద, అల్లు వెంకట్ నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక రోల్ చేస్తున్నారు. 

కాగా నిన్న జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక ఫిబ్రవరి 23న యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుంది. నిన్న విడుదలైన భీమ్లా నాయక్ ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ దక్కించుకుంటుంది. అయితే ట్రైలర్ పై మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. అభిమానులు, ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో భీమ్లా నాయక్ ట్రైలర్ లేదు. ట్రైలర్ కి బీజీఎమ్ సరిగా కుదరకపోవడం పై విమర్శలు వినిపిస్తున్నాయి.