కమెడియన్, నటుడు గెటప్ శ్రీను రోజాకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు. శ్రీను సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్ట్ దూమారం రేపుతోంది. శ్రీను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే.
గెటప్ శ్రీను.. గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోలో వెరైటీ గెటప్‌లు వేస్తూ.. అందరి మన్ననలు పొందాడు. టీవి షోలతో పాటు, సినిమాలు చేస్తున్నారు. త్వరలో రాజు యాదవ్ సినిమాతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అలాగే జబర్దస్త్ షోలో .. అప్పటి జడ్జీలు రోజా, నాగబాబులకు శ్రీను అంటే ఎంతో ఇష్టం. అయితే తాజాగా శ్రీను ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. మంత్రి రోజాను డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశాడు శ్రీను. స్వతహాగా చిరంజీవికి పెద్ద అభిమాని అయిన ఈ నటుడు.
ఈ మధ్య మంత్రి రోజా చిరంజీవి ఫై వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఒకప్పుడు రోజా అంటే అభిమానించే వారు సైతం దాంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను కూడా ఒకరు.
రోజా మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్‌తో పాటు చిరంజీవి, నాగబాబులను జనం ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని.. సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారని.. అందరికీ సాయం చేస్తారు కానీ.. వీళ్లు మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించారు. ఇక చిరంజీవి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ.. పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు దత్తపుత్రుడని.. ప్యాకేజీ స్టార్ అని విమర్శలు గుప్పించారు. అయితే ప్రత్యర్ధి కాబట్టి.. పవన్‌ని విమర్శించినా అర్ధం ఉందని.. కానీ చిరంజీవి ఏం చేశారు? ఆయన సేవా గుణం గురించి విమర్శించే అర్హత రోజాకి ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా లో అభిమానులు ఓ రేంజ్ లో రోజా ఫై మండిపడుతుండగా..జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను సైతం సోషల్ మీడియా లో రోజాను హెచ్చరించటం అంతటా హాట్ టాపిక్ గా మారింది.
‘చిరంజీవి గారి .. సేవా గుణ , దాన గుణం తెరిచిన పుస్తకం ..ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో ,?రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం .. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీమీదున్న గౌరవాన్ని కోల్పోకండి .. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి ‘ అంటూ తన ఫేస్ బుక్‌లో రాసుకొచ్చాడు శ్రీను. ప్రజంట్ ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
వివాదాలకు దూరంగా ఉంటాడు గెటప్ శ్రీను కి ఇంతలా కోపం రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. గెటప్ శ్రీను చేసిన పోస్ట్‌పై వైసీపీ అభిమానులు మాత్రం భగ్గుమంటున్నారు. అటు మెగా ఫ్యాన్స్ శ్రీనుకు తోడుగా నిలబడ్డారు.
